ఎస్పీ బాలు ఇంటికి పోటెత్తిన జనం - ఫాంహౌస్‌కు పార్థివ దేహం తరలింపు - ప్రభుత్వ లాంఛనాలతోనే..

తమ అభిమాన గాయకుడు, గాన గంధర్వుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కడసారి చూసుకోవాలనే కోరికతో వేలాది మంది అభిమానులు చెన్నైలోని ఆయన ఇంటికి పోటెత్తారు. ఎంజీఎం ఆస్పత్రి నుంచి బాలు పార్థివదేహాన్ని కోడంబాక్కంలో ఉన్న ఆయన స్వగృహానికి తీసుకురాగా.. వేలాది మంది అక్కడికి తరలివెళ్లారు. కరోనా వేళ భౌతికదూరం పాటించే వీలు లేకుండా, అభిమానుల తాకిడి అంతకంతకూ పెరుగుతుండటంతో కుటుంబీకులు, అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు..

Recommended Video

    SP Balasubrahmanyam Last Rites By Tamilnadu Govt ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు, పోటెత్తిన జనం...!

    ముందుగానే ఫాంహౌజ్‌కు..

    ముందుగానే ఫాంహౌజ్‌కు..

    ఎస్పీ బాలు ఇంటి వద్ద జనాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో.. భౌతిక దూరాన్ని పాటిస్తూ అభిమాన గాయకుడిని చివరిసారి చూసుకునే వీలును కల్పిస్తూ ముందుగానే ఆయన పార్థివదేహానని తామరైపాక్కంలో ఉన్న ఫాంహౌస్ కు తరలించారు. రాత్రి 10 గంటల తర్వాత ఈ మేరకు తరలింపు ప్రక్రియ పూర్తయింది. శినివారం ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

    గుర్తుపట్టలేనంతగా..

    గుర్తుపట్టలేనంతగా..

    50 రోజులకుపైగా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఎస్పీ బాలు మధ్యలో కోలుకున్నట్లే అనిపించినా.. చివరికి అందరిలో విషాదాన్ని నింపి పైలోకాలకు వెళ్లిపోయారు. ఆయన పార్థీవ దేహం చూసి కన్నీళ్లతో అందరూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇన్నరోజుల చికిత్స కారణంగా బాలు భౌతికకాయం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఎప్పుడూ చలాకీగా, నవ్వుతూ కనిపించే బాలును గుర్తుచేసుకుంటూ, ఆయన భౌతికకాయం అలా మారిపోవడాన్ని చూసి మిత్రులు, ఆప్తులు కన్నీటిపర్యంతమయ్యారు.

    ఇళయరాజ వీడియో వైరల్..

    ఇళయరాజ వీడియో వైరల్..

    'బాలూ నీకోసం నేను ఎదురు చూస్తుంటా. తొందరగా వచ్చేయ్' అంటూ ఓ వీడియో ద్వారా తన బాధను వెళ్లగక్కారు మెస్ట్రో ఇళయరాజా. ఇప్పుడా వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ‘‘బాలూ నీ కోసం నేను ఎదురు చూస్తుంటానని చెప్పాను.. కానీ నా మాట వినకుండా వెళ్లిపోయావు.. నువ్ ఎక్కడికి వెళ్లావ్? ఎందుకు వెళ్లావ? గంధర్వుల కోసం పాడేందుకే వెళ్లావా? నాకు మాటలు రావట్లేదు.. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు.. దీన్ని నేను చూడలేను.. దు:ఖానికైనా ఓ హద్దుంటుంది.. కానీ నీ విషయంలో దానికి పరిమితి లేదు..'' అంటూ రాజా విలవిలలాడారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+