మాములుగా లేదుగా.. స్ట్రాంగ్ రూం వీక్షణ, బైనక్యూలర్ సాయంతో.. ఎస్పీ క్యాండెట్ ఇలా..
ఎల్లుండి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితం వెలువడనుంది. అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే ఈవీఎంలు స్ట్రాంగ్ రూం వద్ద పటిష్ట భ్రదత మధ్య ఉన్నాయి. ఆ వైపు ఎవరినీ రానీయరు. అయితే మీరట్ జిల్లా హస్తినాపూర్‌లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి స్వయంగా తానే స్ట్రాంగ్ రూమ్‌కు కాపు కాస్తున్నాడు. అవును తమకు బీజేపీ ప్రభుత్వంపై, ఎగ్జిట్ పోల్స్‌పై నమ్మకం లేదని అంటున్నారు.

యోగేశ్ వర్మ..
సమాజ్ వాదీ పార్టీ నుంచి యోగేశ్ వర్మ బరిలో ఉన్నారు. ఇవాళ ఉదయం ఈవీఎంలను భద్రపరిచిన బిల్డింగ్ బయట తన కారు ఎక్కి బైనాక్యూలర్‌తో అదే పనిగా స్ట్రాంగ్ రూమ్స్ పరిశీలిస్తూ కనిపించారు. దీంతో మీడియా ప్రతినిధులను ఆయనను ప్రశ్నించగా.. బీజేపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదన్నారు. ఈవీఎంలను ఏమైనా తారుమారు చేస్తారేమోననే భయంతో నిఘా పెట్టామని చెప్పారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లపై ఓ కన్నేసి ఉంచాలని తమ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆదేశించారని చెప్పారు.

3 షిప్టులు
తాము 8 గంటల చొప్పున మూడు షిఫ్టులు వేసుకుని స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కాపు కాస్తున్నామని చెప్పారు. యూపీలో గెలిచేది బీజేపీ అని ఎగ్జిట్ పోల్ సర్వేలపై తమకు నమ్మకం లేదన్నారు. అధికారంలోకి రాబోయేది సమాజ్ వాదీ పార్టీనే అని యోగేశ్ వర్మ అంటున్నారు. భారీ మెజారిటీతో అఖిలేశ్ యాదవ్ సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

పోలీసులు.. పారామిలిటరీ సెక్యూరిటీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. సమాజ్ వాదీ పార్టీ, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు ఎన్నిక జరిగింది. ఓటర్లు తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల్లో మాత్రం మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రాబోతోందని తేలింది. అసలు ప్రజల తీర్పు ఏంటన్నది తేల్చడానికి ఇక మిగిలింది కౌటింగ్ చేసి.. ఎవరు గెలిచారన్నది ప్రకటించడమే మిగిలి ఉంది. మార్చి 10న ఈ ప్రక్రియ సాగబోతోంది. అప్పటి వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రంగా ఉంటాయి. వీటికి అనుక్షణం పోలీసులు, పారా మిలిటరీ సెక్యూరిటీ ఉంటుంది. కానీ యోగేశ్ వర్మకు మాత్రం నమ్మకం లేదు. అందుకే అలా చూశారు.
Recommended Video
#WATCH | Samajwadi Party candidate from Hastinapur constituency in Meerut district, Yogesh Verma keeps an eye on EVM strong room with binoculars to prevent mishandling pic.twitter.com/0eB8FO4vQO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 8, 2022
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications