యూపీలో అఖిలేష్ హామీల జల్లు .. 11 లక్షల ఉద్యోగాలు, ఉచిత విద్యుత్ !!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు దూసుకెళ్తున్నారు. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కమల దళం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ యూపీ పీఠాన్ని దక్కించుకునేందుకు సమాజ్ వాదీ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఉచిత హామీల గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

యూపీలో 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న సుమారు 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆపార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో యోగీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నిరుద్యోగులను గాలి వదిలేశారని మండిపడ్డారు. విద్యా, ఉపాధి రంగాలను నిర్విర్యం చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉగ్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, 69 వేల టీచర్ల నియామకాలు చేపడతామని భరోసా ఇచ్చారు.

ఉచిత విద్యుత్ 300 యూనిట్ల వరకు..
రాష్ట్రంలో 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని అఖిలేష్ హామీలు గుప్పించారు. పారదర్శక పాలన అందిస్తామని చెప్పారు. గిరిజనుల అభివృద్ధికి ఎస్పీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కాషాయ పార్టీ నేతలు తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు దగా కోరులకు కేరాఫ్ ఆడ్రస్‌గా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాల కోరులు ఓట్లు అడిగిందుకు మళ్లీ మీవద్దకు వచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కమలానికి ఎదురుగాలి వీస్తోందని ఎద్దేవా చేశారు.

బడాబాబులకు కొమ్ము కాస్తున్న బీజేపీ
కేంద్రంలో మోదీ ప్రభుత్వం బడాబాబులకు కొమ్ము కాస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వేలాది కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న బడా పారిప్రామిక వేత్తలు.. బీజేపీ ప్రభుత్వం రాగానే దొచుకున్న డబ్బుతో విదేశాలకు పారిపోయారని విమర్శించారు. బీజేపీ పాలనలో పేదలకు ఒక న్యాయం , బడాబాబులకు ఒక న్యాయం అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 23న నాలుగో విడత పోలింగ్ జరుగుతుంది. అందుకు తగ్గ ఏర్పాట్లను అదికారులు పూర్తి చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications