వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో ఓడినా ఎస్పీకి శుభసూచికలు- పెరిగిన ముస్లిం, ఎస్సీ ఓటు బ్యాంకు-బీఎస్పీ ఎఫెక్ట్

|
Google Oneindia TeluguNews

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో హోరాహోరీ పోరాడినా సమాజ్ వాదీ పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు. యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు స్ధానికంగా చోటు చేసుకున్న పరిణామాలు తనకు కలిసొస్తాయని అఖిలేష్ గంపెడాశలు పెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. బీజేపీ గాలిలో ఎస్పీ దారుణంగా ఓడిపోయినా ఓ విషయంలో మాత్రం ఎస్పీకి ఊరట దక్కింది.

Recommended Video

Samajwadi Party Has Increased Its Vote Bank | Oneindia Telugu

యూపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత గణాంకాలను ఓసారి పరిశీలిస్తే గతంతో పోలిస్తే సమాజ్ వాదీ పార్టీ ఎస్సీలు, ముస్లింలలో తన ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకున్నట్లు అర్ధమవుతోంది. యూపీలో యాదవ, ముస్లిం ఓటర్ల మద్దతు కలిగిన సమాజ్ వాదీ పార్టీ.. ఈసారి ఎస్సీలను కూడా తమ ఖాతాలో జమ చేసుకుంది. ముస్లింలలో మరింత పట్టును కూడా సంపాదించింది. అయితే ఇవేవీ ఎస్పీని విజయానికి చేరువ చేయలేకపోయాయి. బీజేపీకి ఎస్పీ పోటీ నివ్వడంలో ఉపయోగపడకుండా పోయాయి.

sp improves muslim, sc vote share as massive losses of bsp, congress in up polls

యూపీలో ఒకప్పుడు సంప్రదాయ ఎస్సీ ఓటు బ్యాంకు కలిగిన మాయావతి ఈసారి మౌనంగా ఉండిపోవడంతో ఎస్సీలంతా గంపగుత్తగా ఎస్పీకి ఓటేశారు. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ముస్లింలు కూడా ఎస్పీకి ఓటేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ హయాంలో ఇబ్బందులు పడిన ముస్లింలు ఎస్పీ అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎస్పీకి ఉన్న ఎస్పీ, ముస్లిం ఓటు బ్యాంకు ఈసారి గణనీయంగా పెరిగింది. తాజా అంచనాల ప్రకారం ఎస్పీకి ఈ ఎన్నికల్లో ముస్లిం జిల్లాల్లో ఓటు బ్యాంకు ఏకంగా 15 శాతం పెరిగింది.

బీజేపికి మాత్రం 1.3 శాతం పెరగగా.. బీఎస్పీకి 7.9 శాతం, కాంగ్రెస్ కు 7.7 శాతం తగ్గింది. అలాగే ఎస్సీ ఓట్లు కలిగిన జిల్లాల్లో ఎస్పీ ఓట్ల శాతం ఏకంగా 15 శాతం పెరిగింది. బీజేపీకి 3.2 శాతం పెరిగింది. మరోవైపు బీఎస్సీ ఎస్సీల ఓటు బ్యాంకును ఆ జిల్లాల్లో 12.1 శాతం కోల్పోయింది. కాంగ్రెస్ కూడా 3.9 శాతం ఎస్సీ ఓట్లను కోల్పోయింది.

English summary
despite its defeat in uttar pradesh elections, samajwadi party has improved its muslim and sc vote share in the polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X