5 మంది రాజీనామాలు ఓకే, 8 మంది రెబల్స్ కు స్పీకర్ షాక్, మరో అవకాశం, లక్కీచాన్స్ !

బెంగళూరు: రాజీనామాలు చేసిన 13 మంది ఎమ్మెల్యేల్లో 5 మంది రాజీనామాలు చట్టపరంగా ఉన్నాయని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. 8 మంది రాజీనామా లేఖలు చట్ట బద్దంగా లేవని స్పీకర్ రమేష్ కుమార్ రెబల్ ఎమ్మెల్యేలకు గట్టి షాక్ ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ మరో అవకాశం ఇచ్చారు.

మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా చేసిన ఎమ్మెల్యేల లేఖలు తాను పరిశీలించానని అన్నారు. చట్టబద్దంగా రాజీనామాలు చెయ్యని ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇస్తున్నానని స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు.

Speaker Ramesh Kumar today examin the resignation of 13 MLAs and said 5 resignations are good and 8 resignation of MLAs were not good.

రాజీనామాలు చేసిన ఆనంద్ సింగ్, రామలింగా రెడ్డి, నారాయణగౌడలు 12వ తేదీ తనను కలవడానికి అవకాశం ఇస్తున్నానని స్పీకర్ రమేష్ కుమార్ చెప్పారు. 8 మంది ఎమ్మెల్యేలు మరోసారి చట్ట బద్దంగా రాజీనామా చెయ్యడానికి తాను అవకాశం ఇస్తున్నానని స్పీకర్ రమేష్ కుమార్ తెలిపారు.

స్పీకర్ రమేష్ కుమార్ వివరణతో మరోసారి రాజీనామాలు చెయ్యడానికి 8 మంది రెబల్ ఎమ్మెల్యేలు సిద్దం అవుతున్నారు. జులై 12వ తేదీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అంతుకు ముందే రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చెయ్యాలని రెబల్ ఎమ్మెల్యేలు ఓ నిర్ణయానికి వచ్చారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+