స్పైస్‌జెట్ ఆఫర్: విమాన టికెట్ ధర రూ. 511

న్యూఢిల్లీ: మనదేశంలో చౌక ధరల విమాన యాన సంస్థ స్పైస్‌ జెట్‌ ప్రత్యేక ఆఫర్లతో మూడు రోజుల ప్రత్యేక సేల్‌ని ప్రకటించింది. సంస్థ 11వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి ఈ సేల్‌ ప్రారంభమవుతుందని చెప్పింది.

దేశీయ టిక్కెట్ల ప్రారంభ ధర రూ.511 కాగా, విదేశీ రూట్లలో టిక్కెట్‌ ప్రారంభ ధర రూ.2,111గా నిర్ణయించినట్లు వెల్లడించింది. మే 19 వరకు ఈ సేల్‌లో తగ్గింపు ధరలకు టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చని చెప్పింది.

దేశీయ రూట్లలో 2016 జూన్‌15 నుంచి సెప్టెంబరు 30లోపు ప్రయాణించాలనుకున్న వారు ఈ సేల్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. దేశీయ రూట్లలో డెహ్రాడూన్, బాగ్‌డోగ్రా, ఉదయ్‌పూర్, జైపూర్, గోవా, పోర్ట్‌బ్లెయిర్, కొచ్చి మొదలగు నగరాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

 SpiceJet Announces Rs. 511 Ticket Offer

అంతర్జాతీయ రూట్లలో 2016 జూన్‌ 1వ తేదీ నుంచి జూలై 20లోపు ప్రయాణించాలనుకున్న వారు ఈ టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది.
కాగా, స్పైస్‌ జెట్‌ డైరెక్ట్‌ ఫ్లైట్‌లలో ప్రయాణించాలనుకునే వారు మాత్రమే ఈ ఆఫర్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఫస్ట్‌ కమ్‌, ఫస్ట్‌ సర్వ్‌ బేసిస్‌ మీద ఈ టిక్కెట్లపై ఆఫర్లు ఉంటాయి.

మరో విమాన యాన సంస్థ ఎయిర్‌ ఏషియా కూడా సోమవారం నుంచి బుధవారం
వరకు 50శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ని ప్రకటించింది. ఆగస్ట్‌ 1 నుంచి నవంబర్‌ 30లోపు ప్రయాణించాలనుకున్న వారు ఈ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+