రవ్ వే పైకి వచ్చిన దున్నపోతు.. ఢీకొట్టిన విమానం
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని సూరత్ విమానాశ్రయంలో గురువారం 140 మంది ప్రయాణీకులతో టేకాఫ్ కోసం రవ్ వే పైకి వచ్చిన స్పైస్ జెట్ విమానం దున్నపోతును ఢీకొట్టింది. ఈ సంఘటన సాయంత్రం 7 గంటలకు జరిగింది.

ఢిల్లీ వెళ్లడానికి టేకాఫ్ అవుతున్న స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం ఇంజన్ భాగం దెబ్బతినగా, దున్నపోతు మృతి చెందింది. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారు. వారిని మరో విమానంలో ఢిల్లీకి పంపించామని విమానయాన శాఖ ప్రతినిధులు తెలిపారు.
స్పైస్ జెట్ ఎస్‌జీ 622 విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో రన్ వేపైకి దున్నపోతు రావడంపై విమానయాన శాఖ అప్రమత్తమైంది. రన్ వేపైకి దున్నపోతు రావడాన్ని తీవ్రంగా పరిగణించిన విమానయాన శాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతపైన సమీక్ష చేయాలని చెప్పింది.












Click it and Unblock the Notifications