వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాను దాటేయనున్న ఇండియా: ఇంకా కొద్ది రోజుల్లోనే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. మే 8న ఉదయం ఆరోగ్యసేతు యాప్ ప్రకారం గత ఆరు రోజుల నుంచి వరుసగా దేశంలో 2500కుపైగా కేసులు పెరుగుతున్నాయి. రెట్టింపు కేసులు నమోదయ్యే కాలం మే మొదటి వారం 15 రోజులు ఉండగా, ఆ కాలం క్రమంగా తగ్గే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

India Near To Surpasses China With this Rate of Increase In Covid-19 Cases

కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే? కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?

చైనాను దాటేసేందుకు..

చైనాను దాటేసేందుకు..


కాగా, గత నాలుగు రోజుల నుంచి ప్రతి రోజూ 3వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 56వేలు దాటింది.
కరోనావైరస్‌కు పుట్టినట్లు అయిన చైనాను దాటేసేందుకు మనదేశం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే మనదేశంలో చైనా కంటే ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చైనాలో కేసులు ఇలా..

చైనాలో కేసులు ఇలా..

కరోనావైరస్ గుర్తించిన తర్వాత వుహాన్ నగరంలో చైనా జనవరి నుంచి కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. కరోనా కేసులు నియంత్రణలోకి రావడంతో మార్చిలో లాక్‌డౌన్ ఎత్తివేసింది. ఫిబ్రవరి 16న 19వేల కేసులు నమోదు కాగా, ఇప్పుడు రోజుకు 1000 కంటే తక్కువ కేసులే నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు(గురువారం నాటికి) చైనాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 82,886 కేసులు నమోదయ్యాయి. 4633 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

కొద్ది రోజుల్లోనే చైనాను అధిగమించనున్న భారత్..

కొద్ది రోజుల్లోనే చైనాను అధిగమించనున్న భారత్..

ప్రస్తుతం మనదేశంలో మూడో దశ లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో సడలింపులు ప్రకటించారు. అయితే, క్రమంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చైనా కంటే మనదేశంలో ఇప్పటికైతే తక్కువ కేసులే ఉన్నప్పటికీ.. మరో 26వేల కేసులు నమోదైతే ఆ దేశాన్ని దాటేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చైనా కంటే తక్కువగానే ఉన్నప్పటికీ మరణాల సంఖ్య కూడా మనదేశంలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్, జులై, ఆగస్టు నెలల్లో మరింతగా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం, ప్రజలు కలిసి కరోనా కట్డడి కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే తప్ప, ఈ మహమ్మారిని దేశం నుంచి పూర్తిగా పారద్రోలే అవకాశం లేదు.

English summary
Spike in coronavirus cases: How long before India surpasses China?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X