యువతితో ఆధ్యాత్మిక గురు సంబంధం-బ్రిట్నీ స్పియర్ కేసును ప్రస్తావించిన సుప్రీం-జోక్యం చేసుకోలేమని...

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ముందుకు మంగళవారం(జులై 6) ఓ క్లిష్టమైన కేసు వచ్చింది. 21 ఏళ్ల తన భాగస్వామిని ఆమె తల్లిదండ్రులు అక్రమంగా నిర్భంధించారని 42 ఏళ్ల ఓ ఆధ్యాత్మిక గురువు కోర్టును ఆశ్రయించాడు. తల్లిదండ్రుల నిర్బంధం నుంచి ఆమెను విముక్తిని చేసేలా ఆదేశాలివ్వాలని కోరాడు. కేరళ హైకోర్టులో అతను దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేయడంతో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు విచారణ సందర్భంగా అమెరికా పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ కేసును సుప్రీం కోర్టు ప్రస్తావించడం గమనార్హం.

అసలేంటీ కేసు...

అసలేంటీ కేసు...


కేరళకు చెందిన 21 ఏళ్ల ఓ యువతికి,ఓ ఆధ్యాత్మిక గురువుకు మధ్య సంబంధం ఉందన్న ఆరోపణలున్నాయి. నిజానికి యువతి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులే ఆమెను ఆ ఆధ్యాత్మిక గురువు వద్దకు పంపించారు. కానీ తీరా అక్కడికి వెళ్లాక ఆ గురూజీ యువతితో సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ కూతురిని తీసుకెళ్లిపోయారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆ ఆధ్యాత్మిక గురు మొదట కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. తల్లిదండ్రుల చెర నుంచి ఆమెను విడిపించాలని కోరాడు.

జోక్యం చేసుకోలేమన్న కోర్టు...

జోక్యం చేసుకోలేమన్న కోర్టు...


హైకోర్టు అతని పిటిషన్‌ను కొట్టిపారేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ కేసును పరోక్షంగా ఉదహరించింది. 'ఇది మేము జోక్యం చేసుకోగల కేసు కాదు. ఆ యువతి మానసిక స్థితి సరిగా లేదని ఇప్పటికే హైకోర్టు చెప్పింది. వారం క్రితం అమెరికాలో ఓ కేసు విచారణ జరిగింది. అయితే అక్కడి చట్టాలు,సంస్కృతి వేరు. 'మేజర్' అయిన వ్యక్తి అంగీకారం లేకుండా ఏదీ చేయడానికి వీల్లేదు. ఇక్కడ మాత్రం పోలీసులు వారితో మాట్లాడాల్సి ఉంటుంది. ఆ కుటుంబం కూడా విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.' అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

ఆధ్యాత్మిక గురువులు,బాబాలపై కామెంట్స్...

ఆధ్యాత్మిక గురువులు,బాబాలపై కామెంట్స్...


బ్రిట్నీ స్పియర్ కేసుతో పాటు ఇప్పుడు తమ ముందుకు వచ్చిన కేసులో తల్లిదండ్రులు వారి కూతుళ్ల మానసిక స్థితి సరిగా లేదని చెబుతున్నట్లు సుప్రీం పేర్కొంది.'భారత్‌లో ఏ తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా ఇలా చెప్పరు.తమ కూతురి మానసిక స్థితి సరిగా లేదని తల్లి,తండ్రి ఇద్దరూ చెబుతున్నారు. చికిత్స కోసం తమ కూతురిని ఆ ఆధ్యాత్మిక గురువు వద్దకు పంపిస్తే ఆమెతో అతను సంబంధం ఏర్పరుచుకున్నాడని చెబుతున్నారు. ఇలాంటి చర్యలు నమ్మకాన్ని పోగొడుతాయి.' అని సుప్రీం బెంచ్ పేర్కొంది.ఇటీవలి కాలంలో చాలామంది ఆధ్యాత్మిక గురువులు,బాబాలు యువతులను ప్రభావితం చేస్తున్నారని సుప్రీం వ్యాఖ్యానించింది. వీరిపై చాలా ఆరోపణలు వస్తున్నాయని... పిల్లల జీవితాలను వీరు ప్రభావితం చేస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ కొద్ది రోజుల క్రితం ఒక పిటిషన్ కూడా దాఖలైందని తెలిపింది.

బ్రిట్నీ కేసును ఎందుకు ప్రస్తావించినట్లు...

బ్రిట్నీ కేసును ఎందుకు ప్రస్తావించినట్లు...


'మా సంతృప్తి కోసం నెల రోజుల తర్వాత ఆ యువతిని సంబంధిత జిల్లా కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా కేరళ హైకోర్టు రిజిస్ట్రార్‌ను విజ్ఞప్తి చేస్తున్నాం.' అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. జిల్లా జడ్జి ఆ యువతితో పాటు ఆమె తల్లిదండ్రులతో పాటు యోగక్షేమాలపై ఆరా తీయనున్నారు. అనంతరం ఆమె మానసిక స్థితిపై సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. కాగా,ఇటీవల అమెరికా పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ కూడా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన తండ్రిని సంరక్షణ స్థానం నుంచి తప్పించాలని ఆమె కోర్టును కోరింది. ఆయన సంరక్షణలో తాను నరకం అనుభవిస్తున్నానని... తనను విముక్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. మానసిక స్థితి సరిగా లేదన్న కారణంతో 2008లో బ్రిట్నీ సంరక్షణ బాధ్యతలను కోర్టు ఆమె తండ్రి జేమ్స్‌కు అప్పగించింది. అయితే ఆయన సంరక్షణలో తనకు మనో వేదనే మిగిలిందని బ్రిట్నీ వాపోతోంది. కేరళ యువతి కేసులో ఆధ్యాత్మికవేత్త వాదన కూడా ఇలాగే ఉండటంతో బ్రిట్నీ కేసును న్యాయస్థానం ప్రస్తావించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+