వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్రారంభం-ఏడాదికి 100 మిలియన్‌ డోసులు

|
Google Oneindia TeluguNews

భారత్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రష్యన్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ ఉత్పత్తి ఎట్టకేలకు ప్రారఁభమైంది. ఢిల్లీకి చెందిన పనాసియా బయోటెక్‌ సంస్ధ రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేయబోతోంది. ఏడాదికి వంద మిలియన్ల వ్యాక్సిన్‌ల ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయనున్నట్లు సంస్ధ ప్రకటించింది.

Recommended Video

Sputnik V : Second Batch Of Russian Covid-19 Vaccine Reaches Hyderabad

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, ఢిల్లీకి చెందిన పనాసియా బయోటెక్‌ సహకారంతో స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేయబోతోంది. ప్రపంచంలోనే తొలి రిజిస్టర్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ అయిన స్పుత్నిక్‌ వీని ఏడాదికి వంద మిలియన్‌ డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ఇవాళ ప్రకటించింది. తొలి విడతలో ఇక్కడ తయారైన వ్యాక్సిన్ డోసుల్ని పనాసియా సంస్ధ రష్యాలోని మాస్కోలో ఉన్న గమలేయా ఇన్‌స్టిట్యూట్‌కు పంపనుంది. అక్కడ నాణ్యత పరిశీలన తర్వాత భారత్‌లో పూర్తిస్దాయి ఉత్పత్తి ప్రారంభం కానుంది.

Sputnik V Production Begins in India, Delhi Firm Panacea Biotec Set to Produce 100 Mn Doses a Year

ఈ ఏడాది ఏప్రిల్‌ 12న రష్యన్‌ స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌లో భారత్‌లో అత్యవసర వాడకానికి కేంద్రం అనుమతి ఇవ్వగా.. మే 14న తొలి డోస్‌ కూడా ఇచ్చారు. రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్‌తో కలిసి స్పుత్నిక్‌ వ్యాక్సిన్ తయారు చేయనుండటం చాలా గొప్ప అనుభూతినిస్తోందని పనాసియా బయోటెక్ ఎండీ రాజేశ్‌ జైన్‌ ప్రకటించారు. అటు ఆర్డీఐఎఫ్ కూడా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్‌లో వ్యాక్సిన్ తయారుచేయనుండటం మంచి పరిణామంగా భావిస్తున్నట్లు తెలిపారు.

English summary
Giving a boost to the ongoing Covid-19 vaccination drive in India, one of the country’s leading vaccine and pharmaceutical firms joined hands with Russia’s sovereign wealth fund and launched the production of Sputnik V in India on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X