భయంతో సముద్రంలో 10 రోజులు గడిపిన క్రిమినల్స్, అసలు మ్యాటర్ తో షాక్!
బెంగళూరు/చెన్నై: శ్రీలంకకు చెందిన ముగ్గురు కరుడుగట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. పాదుచ్చేరి సమీపంలోని బంగాళాఖాతంలో ఓడలో 10 రోజుల పాటు పోలీసులకు భయపడి సముద్రంలో గడిపారని, తరువాత భారత్‌లోకి చొరబడ్డారనే విషయం బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
కరుడుగట్టిన నేరస్థులు కసన్ కుమార్ సంకా, అమిల్ నువాన్ అసంక అలియాస్ గోటాసిల్వ, రంగప్రసాద్ అలియాస్ చుట్టా అనే ముగ్గురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ శ్రీలంక నుంచి అక్రమంగా పుదుచ్చేరిలోకి వచ్చారు. అయితే ఆ సమయంలో బంగాళాఖాతం ఒడ్డున భద్రతా బలగాలు కాపలా కాస్తున్నట్లు సమాచారం అందుకున్న నిందితులు భయాందోళనకు గురై పుదుచ్చేరి సమీపంలో ఓడలో 10 రోజులు సంచరించి చివరకు ఒడ్డుకు చేరుకున్నట్లు బెంగళూరు సీసీబీ వర్గాలు కన్నడప్రభ వార్తాపత్రికు సమాచారం అందించాయి.

కొద్ది రోజుల క్రితం బెంగుళూరు వచ్చి స్థిరపడిన శ్రీలంక కరుడుగట్టిన నేరస్థులు కసన్ కుమార్ సంకా, అమిల్ నువాన్ అసంక అలియాస్ గోటా సిల్వా, రంగప్రసాద్ అలియాస్ చుట్టా, వారికి ఆశ్రయం కల్పించిన బెంగళూరులోని జక్కూరుకు చెందిన జై పరమేష్ లను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విచారణలో తమిళనాడులోని చెన్నై నగరంలో మన్సూర్ అలీ, బెంగళూరులోని వివేకనగర్‌లో ఈ నేరగాళ్లకు ఆర్థికంగా సహకరించిన అన్బళగన్‌లు బెంగళూరు సీసీబీ పోలీసులకు పట్టుబడ్డారు.
ఈ కేసుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకుని తమిళనాడు, పుదుచ్చేరికి పిలుచుకుని వెళ్లిన బెంగళూరు పోలీసులు వారిని స్పాట్ విచారణ చేశారు. ఆ తర్వాత శ్రీలంక నేరగాళ్లు పుదుచ్చేరి నుంచి బెంగళూరు మధ్య దొంగగా ఎలా ప్రయాణించాము అని పిన్ టూ పిన్ చెప్పారని తెలిసింది. నిందితులు శ్రీలంక మీదుగా రామేశ్వరం, తరువాత పుదుచ్చేరి వచ్చి తరువాత సేలం మీదుగా బెంగళూరు చేరుకున్నారని సీసీబీ పోలీసు అధికారులు తెలిపారు.
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం నిందితులు పుదుచ్చేరి రావాల్సి ఉంది. అయితే ఆ రోజు నేవీ, కోస్ట్ గార్డ్ లు అప్రమత్తమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న నిందితులు పుదుచ్చేరి ఒడ్డుకు చేరుకోకుండా మధ్యలోనే తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి దగ్గర సముద్రంలో ఓడలోనే పది రోజులు గడిపారు. భారత్ భద్రతా బలగాలకు పట్టుబడకుండా నిందితులు దొంగచాటుగా భారత్ లోకి చొరబడ్డారని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications