చిక్కుముడులు వీడినట్లే!: ఎట్టకేలకు శ్రీదేవి బాడీ అప్పగింతకు దుబాయ్ ప్రాసిక్యూషన్ ఓకే
Recommended Video

దుబాయ్: హోటల్లో మృతి చెందిన శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించేందుకు దుబాయ్ ప్రాసిక్యూషన్ మంగళవారం అనుమతించింది. ప్రాసిక్యూషన్ నిర్ణయంతో చిక్కుముడులు వీడే అవకాశముంది. శ్రీదేవి కుటుంబ సభ్యులకు, భారత అధికారులకు ప్రాసిక్యూషన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది. మృతదేహం రిలీజ్ లెటర్ అందినట్లు భారత కార్యాలయం ధృవీకరించింది.
శ్రీదేవి మృతిపై మీడియాలో వివిధ రకాలుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దుబాయ్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. శ్రీదేవి మృతిపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

దుబాయ్ పోలీసులు ఇలా
భారతీయ నటి శ్రీదేవి మృతి అందరినీ షాక్‌కు గురి చేసిందని, కానీ ఎందుకు ఏవేవో ఊహించుకుంటూ ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారని, దుబాయ్ అధికారుల విచారణ పూర్తికాకుండానే భారత్‌కి చెందిన కొన్ని మీడియా వర్గాలు ఈ కేసులో న్యాయమూర్తిగా వ్యవహరించాలని చూస్తున్నాయని దుబాయ్ పోలీసులు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.

నిజాలు తెలుసుకుంటున్నారు
అధికారులు నిజానిజాలు తెలుసుకుంటున్నారని, బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోవడం వల్లే శ్రీదేవి చనిపోయిందని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందని, భారత్‌కు చెందిన మీడియాకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నామని, ఇలాంటి సమయంలో కాస్త ఓపిక పట్టాలని దుబాయ్ పోలీసులు అన్నారు.

ఇలా సహజమే
దుబాయ్ సీనియర్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. దుబాయ్‌లో అందరిలాగే శ్రీదేవి విషయంలో వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఇలాంటి కేసుల్లో ఇలాంటి దర్యాఫ్తు సహజమే అన్నారు. విచారణ అనంతరం నిజాలు తెలుస్తాయని చెప్పారు. కేసుకు సంబంధించి అందరినీ విచారిస్తామన్నారు.

రీపోస్టుమార్టం లేనట్లే
శ్రీదేవి భౌతిక కాయం తీసుకునేందుకు ఇప్పటికే అర్జున్ కపూర్ దుబాయ్ చేరుకున్నారు. శ్రీదేవి మృతదేహాన్ని కాసేపట్లో ఎంబామింగ్‌కు పంపింస్తారు. ఆ తర్వాత అప్పగిస్తారు. తాజాగా, ప్రాసిక్యూషన్ నిర్ణయంతో రీపోస్టుమార్టం లేనట్లే.

రేపు అంత్యక్రియలు
శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్ చేసిన అనంతరం భారత్‌కు అప్పగిస్తారు. ఆ తర్వాత దుబాయ్ నుంచి భారత్ బయలుదేరుతారు. భారత్ వచ్చేందుకు నాలుగైదు గంటల సమయం పడుతుంది. బుధవారం అంత్యక్రియలు జరిగే అవకాశముంది. ఎంబామింగ్‌కు మూడు నాలుగు గంటలు పడుతుంది. ఆ తర్వాత అప్పగిస్తారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications