మృతిలో కొత్త కోణం, శ్రీదేవి కేసులో సంచలనం: తలపై తీవ్ర గాయాలు, ఎలా వచ్చాయి?
దుబాయ్: సినీ నటి శ్రీదేవి మృతి కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. ఆమె తలపై గాయాలు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 24న ఆమె బాత్రూంలో చనిపోయిన విషయం తెలిసిందే.
దీనిపై దుబాయ్ పోలీసులు విచారణ జరిపారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేతికి వచ్చింది. ఇందులో పలు షాకింగ్ అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆమె ముఖంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

చనిపోవడానికి ముందు గాయాలా?
శ్రీదేవి ముఖంపై ఉన్న గాయాలు ఎప్పుడు అయ్యాయనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ గాయాలు చనిపోవడానికి ముందువా, లేక తర్వాతవా, లేక ఫోరెన్సిక్ విచారణ సమయంలో ఏమైనా జరిగాయా? అనే విషయాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

పూర్తి వివరాలు, ఆధారాలు సేకరించాక
శ్రీదేవి మృతి విషయంలో ఎప్పటికి అప్పుడు వస్తున్న వివరాలు షాకింగ్‌కు గురి చేస్తున్నాయి. ఇప్పుడు ఆమె ముఖంపై గాయాలు ఉండటం మరో కొత్త కోణం. పూర్తి వివరాలు, ఆధారాలు తీసుకున్న తర్వాతే శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించేందుకు మంగళవారం నిర్ణయించారు.

నీటమునిగి మృతి
శ్రీదేవి బాత్ టబ్‌లో మునగడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అపస్మారక స్థితిలో ఉన్నారని, ఆమె విడిది చేసిన హోటల్‌లోనే శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఆ మేరకు డాక్టర్లు జారీ చేసిన ఫోరెన్సిక్ నివేదికను కుటుంబ సభ్యులకు, భారత రాయబార కార్యాలయ అధికారులకు అందజేసింది. ఈ కేసును తదుపరి చర్యల నిమిత్తం దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేసింది. ఆ తర్వాత మంగళవారం ప్రాసిక్యూషన్ మృతదేహాన్ని తరలించేందుకు అనుమతులు ఇచ్చింది.

గదిలోనే బోనీ కపూర్
శనివారం రాత్రి శ్రీదేవి ప్రమాదానికి గురైన సమయంలో గదిలో ఆమె భర్త బోనీకపూర్ ఉన్నారని, బాత్రూం గదిలోకి వెళ్లిన వెంటనే ఆమెకు గుండెపోటు రావడంతో బాత్ టబ్‌లో పడిపోయారని, అపస్మారక స్థితిలోకి వెళ్లారని, యూఏఈ నుంచి వెలువడే ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. అయితే, బోనీ కపూర్ ఉండటంపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.

ఆ సమయంలో విషాదం
దుబాయ్‌లో బంధువుల పెళ్లి వేడుక అనంతరం శ్రీదేవి భర్త బోనీకపూర్, చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ముంబైకి తిరిగి వెళ్లారు. శ్రీదేవి మాత్రం తన సోదరి శ్రీలతతో మరింత సమయం గడపటం కోసం ఎమిరేట్స్ టవర్స్‌లోని హోటల్ గదిలో ఉండిపోయారు.
ముంబైలో విందుకు హాజరైన అనంతరం బోనీకపూర్.. శ్రీదేవికి సర్ ప్రైజ్ విందు ఇవ్వాలనుకున్నారు. అందుకోసం తిరిగి దుబాయ్ వెళ్లారు. హోటల్‌కు వెళ్లాక ఆమెను నిద్రలేపి విందుకు సిద్దం కావాలన్నారు. ఆ సమయంలో విషాదం చోటు చేసుకుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications