వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలియుగ శ్రీరాముడు శ్రీనివాస్ గుప్తా: భార్య మైనపు బొమ్మతో గృహ ప్రవేశం..

|
Google Oneindia TeluguNews

ఈ రోజుల్లో భార్య, భర్తల మధ్య బంధం, అనుబంధం అంతంత మాత్రమే.. ఏదో చిన్న విషయానికి గొడవ, అలకలు సహజమే. అయితే కొందరు భార్యను టార్చర్ చేస్తుండగా.. మరికొందరు భర్తలకు చుక్కలు చూపిస్తుంటారు. అంటే ఇరువైపులా సర్దుకుపోయి సంసార బంధాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే భార్య చనిపోయినా.. మరచిపోలేని వారు ఉన్నారా..? ఆమె ప్రతీమను ఇంట్లో పెట్టుకునే మంచి మనషులు ఉన్నారా అంటే శ్రీనివాస్ గుప్తా అనే అతనిని చూపించాల్సి వస్తోంది.

 భార్య చనిపోవడంతో..

భార్య చనిపోవడంతో..

కర్ణాటక కొప్పల్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా కొద్దిరోజుల కింద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యను చనిపోయారు. భార్యను మర్చిపోలేని ఆయన ఆమె రూపురేఖలతో మైనపు బొమ్మ తయారు చేయించారు. ఇటీవల గృహప్రవేశం సందర్భంగా ఆ విగ్రహాన్ని ప్రదర్శించారు. గృహప్రవేశం వేడుకలో భార్య కూడా తన పక్కనే ఉందన్న భావనతో ఆయన ఎంతో సంతోషానికి లోనయ్యారు. శ్రీనివాస్ గుప్తా కుటుంబ సభ్యులు ఆ మైనపు బొమ్మతో ఫొటోలు దిగి ఆనంద పడిపోయారు.

 ఉట్టిపడుతోన్న జీవకళ..

ఉట్టిపడుతోన్న జీవకళ..

మొహంలో చిరున‌వ్వుతో జీవ‌క‌ళ ఉట్టిప‌డుతున్న విగ్ర‌హాన్ని చూసే అస‌ల‌ది బొమ్మేనా అని గృహ ప్రవేశానికి వచ్చినవారు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. చీర, నగలు, కురులు.. అతి దగ్గరిగా వెళ్లి చూస్తే తప్ప అచ్చం మనిషిలాగే ఉన్న దానిని విగ్రహాం అని గుర్తించలేం. శ్రీనివాస్ గుప్తా, కూతుళ్లు, బంధుమిత్రులు మైనపు బొమ్మతో ఫొటోలు దిగి పోస్ట్ చేశారు. అవీ కాస్త సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Recommended Video

కొరియోగ్రఫర్ Dhanashree Verma తో Yuzvendra Chahal నిశ్చితార్థం || Oneindia Telugu
 కలియుగ శ్రీరాముడు

కలియుగ శ్రీరాముడు


గుప్తా తన భార్య ప్రతీమతో మైనపు విగ్రహాన్నే తయారు చేయించాడు. ఆనాడు రాజసూయ యాగానికి శ్రీరాముడు స్వర్ణ సీతమ్మను తయారు చేయిస్తే.. నేడు ఈ శ్రీనివాసుడు గృహ ప్రవేశానికి ఏకంగా మైనపు సతీమణినే తయారు చేయించాడు.

English summary
srinivas gupta makes wax statue of his wife in karnataka koppal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X