ఎస్ఎస్సీ పరీక్ష పేపర్ లీక్: సీబీఐ దర్యాఫ్తుకు ఓకే, మార్చి 12కు సుప్రీం విచారణ వాయిదా
న్యూఢిల్లీ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పేపర్ లీకేజీపై సీబీఐతో దర్యాఫ్తు చేయించేందుకు ఎస్సెస్సీ చైర్మన్ ఆషిమ్ ఖురానా అంగీకరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
గతనెల 17 నుంచి 22 వరకు ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ (టైర్ 2) పరీక్షలను నిర్వహించారు. కానీ 21వ తేదీ జరగాల్సిన పరీక్షను వాయిదా వేశారు. పేపర్ లీక్ కావడంతోనే పరీక్ష వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి.

దీంతో అభ్యర్థులు ఢిల్లీలో కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. వారికి అన్నాహజారే ఆదివారం మద్దతు తెలిపారు. ఈ వివాదంపై ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు.
ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్‌పై సీబీఐ దర్యాప్తు చేయించాల్సిందిగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలతో పాటు అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ దర్యాప్తు చేయించేందుకు ఎస్ఎస్సీ నిర్ణయించింది.
దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. మార్చి 12వ తేదీన ఈ కేసును విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం సోమవారం చెప్పింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications