అమెరికా నుంచి పాక్ కు ప్రధాని హెచ్చరిక - మూడో అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా భారత్..!!
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమెరికా కాంగ్రెస్ సమావేశంలో కీలక ప్రసంగం చేసారు. పరోక్షంగా పాకిస్థాన్ క హెచ్చరికలు చేసారు. ప్రపంచంలోనే భారత్ ప్రస్తుతం మూడో అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా మారుతోందని వివరించారు. 9/11 దాడులు..26/11 దాడులను ప్రధాని ప్రస్తావించారు. దశాబ్దాల కాలం గడుస్తున్నా ఉగ్రవాదం ఇప్పటికీ ప్రమాదకరంగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని ప్రసంగం వేళ కరతాళ ధ్వనులు మారుమోగాయి.
15 standing ovations, 79 applauses marked Prime Minister Narendra Modi’s address to the joint session of the US Congress. pic.twitter.com/NeC2l26J47
— ANI (@ANI) June 22, 2023
కాంగ్రెస్ లో ప్రధాని ప్రసంగం
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అక్కడ అపూర్వ స్వాగతం లభిస్తోంది. ప్రవాస భారతీయులు భారత్ మాతా కై జై..మోదీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. శ్వేత సౌధంలో ప్రధానికి అరుదైన అతిధ్యం లభించింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భద్రత..రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి.

దేశీయంగా జెట్ ఇంజన్ల ఉత్పత్తి పైన నిర్ణయం జరిగింది. శ్వేతసౌధం కు చేరుకున్న ప్రధానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్..జిల్ బైడెన్ ఆత్మీయ స్వాగతం పలికారు. బైడెన్ దంపతులకు భారతీయ సంప్రదాయ పద్దతితో ప్రధాని ప్రత్యేక బహుమానాలు అందించారు. బైడెన్ సైతం ప్రధానికి అరుదైన గిఫ్ట్ బహూకరించారు.
#WATCH | Our vision is 'Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka Prayaas'. We are focussing on infrastructure developments. We have given nearly 40 million homes to provide shelter to over 150 million people, which is nearly 6 times the population of Australia: Prime… pic.twitter.com/e6EFjlPity
— ANI (@ANI) June 22, 2023
పాక్..చైనా కు పరోక్ష చురకలు
అమెరికన్ కాంగ్రెస్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో ఎలాంటి సందేహాలకు తావు ఉండకూడదని తేల్చి చెప్పారు. చైనా పైనా ప్రధాని మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు చేసారు. ఐక్యరాజ్య సమితి చార్టర్ సూత్రాలపై గౌరవం..వివాదాలను శాంతియుతంగా పరిష్కరించటం..సార్వభౌమాధికారం..ప్రాదేశిక సమగ్రతను గౌరవించటం పైనే గ్లోబల్ ఆర్దర్ ఆధారపడి ఉందని చైనాను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.
US Congressmen lined up to take autographs and selfies with Prime Minister Narendra Modi after his address to the joint sitting of the US Congress. pic.twitter.com/KnIRIJVlV1
— ANI (@ANI) June 22, 2023
తాను ప్రధానిగా తొలి సారి అమెరికాను సందర్శించిన సమయంలో భారత్..నాడు ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా ఉండేదాని..ప్రస్తుతం 5వ స్థానంలో ఉందని చెప్పారు. త్వరలోనే మూడో స్థానానికి చేరుకుంటుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేసారు.
రెండు దేశాల మైత్రి ద్వారా
భారత్ ఎదగటమే కాకుందా..త్వరిత గతిన అభివృద్ది చెందుతున్నామని వివరించారు. భారత్ అభివృద్ధి చెందితే..ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుతుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచాభివృద్ధి భారత్ - అమెరికా కలిసి నడవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. అమెరికాలో ప్రఖ్యాల విద్యాలున్నాయని చెప్పారు. భారత్ లో అతి పెద్ద యువశక్తి ఉందన్నారు.
ఈ రెండు కలిస్తే సుస్థిర.. సమ్మిళిత ప్రపంచాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని వివరించారు. అమెరికన్ కాంగ్రెస్ లో ప్రసంగం తరువాత ప్రధాని మోదీ శ్వేతసౌధం లో అధ్యక్షుడు బైడెన్ ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్ కు హాజరయ్యారు. భారత్ - అమెరికాకు చెందిన అధికార..పారిశ్రామిక దిగ్గజాలు ఈ విందులో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications