సీన్ రివర్స్, స్టార్ హీరో, డీసీఎం రహస్య చర్చలు, నిన్న ఒకపార్టీకి ప్రచారం, నేడు అధికార పార్టీతో!

బహుబాష నటుడు, దర్శకుడు, రాజమౌలి ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను బెంగళూరులోని డీకే శివకుమార్ అధికారిక నివాసంలోని కార్యాలయంలో కలిశారు. డీసీఎం డీకే శివకుమార్ ఎక్స్ (ట్విట్టర్)లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. అంతే కాకుండా కిచ్చా సుదీప్ తో కలిసి తీసుకున్న ఫోటోలను కూడా డీకే శివకుమార్ సోసల్ మీడియాలో షేర్ చేశారు.

బహుబాష నటుడు సుదీప్‌కి కర్ణాటకలోని వివిద పార్టీలకు చెందిన చాలా మంది రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. డీకే శివకుమార్ కు యాజమాన్యంలోని గ్లోబల్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా సుదీప్ తో కలసి కనిపించారు. హీరో సుదీప్ ఆదివారం డీకే శివకుమార్ అధికారిక నివాసానికి వెళ్లి చాలా సేపు చర్చించారు. అయితే వీరిద్దరూ ఏ వియంపై చర్చించారు అనే అంశాన్ని ఇంతవరకు ప్రస్తావించలేదు. ఇది ఒక రహస్య చర్చ అని ఇరు వర్గాలకు చెందిన సన్నిహితులు అంటున్నారు.

Star hero Kiccha Sudeep held secret talks with Karnataka DCM DK Shivakumar

హీరో సుదీప్ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ అభ్యర్థుల తరపున కర్ణాటకలోని అనేక నియోజక వర్గాల్లో జోరుగా ప్రచారం చేశారు. ఉత్తర కర్ణాటకలోని పలు నియోజకవర్గాల్లో హీరో సుదీప్ బీజేపీ తరపున ప్రచారం చేశారు. మాజీ సీఎం బసవరాజ్ బొమ్మైకి అత్యంత సన్నిహితుడైన హీరో సుదీప్ బీజేపీ తరుపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి అంగీకరించారు.

Star hero Kiccha Sudeep held secret talks with Karnataka DCM DK Shivakumar

అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ కోసమే బీజేపీ కోసం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేశానని హీరో సుదీప్ బహిరంగంగా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల పూర్తి అయిన తరువాత బీజేపీ ఓడిపోవడం, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. తరువాత డీకే శివకుమార్ యాజమాన్యంలోని గ్లోబల్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో సుదీప్ ప్రత్యక్షం అయ్యారు.

అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు డీకే శివకుమార్‌తో కలిసి మరోసారి కనిపించిన హీరో సుదీప్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అన్ని ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుందని, హీరో సుదీప్ తనను మర్యాదపూర్వకంగా కలిశారని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ట్విట్టర్ లో పోస్ట్‌ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+