శుభవార్త: నగదు బదిలీపై ఛార్జీలను తగ్గించిన ఎస్‌బిఐ
ఎస్‌బిఐ నగదు బదిలీ ఛార్జీలను భారీగా తగ్గించింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ ( ఎన్ఈఎఫ్‌టి), రియల్ టైమ్ గ్రోస్ డెట్లెమెంట్ (ఆర్‌జిఎస్) ఛార్జీలు 75 శాతం వరకు తగ్గించినట్టు .
న్యూఢిల్లీ: ఎస్‌బిఐ నగదు బదిలీ ఛార్జీలను భారీగా తగ్గించింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ ( ఎన్ఈఎఫ్‌టి), రియల్ టైమ్ గ్రోస్ డెట్లెమెంట్ (ఆర్‌జిఎస్) ఛార్జీలు 75 శాతం వరకు తగ్గించినట్టు గురువారంనాడు ప్రకటించింది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, బ్యాంకు అందించే మొబైల్ బ్యాంకింగ్ సేవల ద్వారా జరిగే లావాదేవీలలో తగ్గిన ఛార్జీలు వర్తిస్తాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తగ్గింపు ధరలు జూలై 15 నుండి అమల్లోకి వస్తాయని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఎకానమీ సాధనలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ , మొబైల్ బ్యాంకింగ్ సేవలను ప్రోత్సహించడానికి ఈ చర్య అని ఎస్‌బిఐ మేనేజింగ్ డైరెక్టర్ రాజనీష్‌కుమార్ ప్రకటించారు.
సవరించిన రేట్ల ప్రకారంగా నెఫ్ట్ లావాదేవీలకు రూ.10వేలవరకు రూ.2లకు బదులుగా, ఇకపై రూ.1 వసూలు చేయనున్నారు. రూ.10వేల నుండి లక్షరూపాయాలవరకు నగదు బదిలీపై ప్రస్తుతం వసూలుచేస్తోన్న లక్ష నుండి రెండులక్షలకు రూ. 12లకు బదులుగా రూ. 3లను వసూలు చేయనున్నారు.
ఇక ఆర్‌టీజీఎస్‌పై కూడ భారీగా ఛార్జీలను తగ్గించింది ఎస్‌బిఐ. రూ. లక్షల నుండి రూ. 5 లక్షల లావాదేవీలపై రూ.20 స్థానంలో ఇకనుండి రూ.5 వసూలు చేయనున్నారు. రూ.5 లక్షలకు పైగా నగదును బదిలీ చేయాలంటే రూ.40 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది మార్చి31 నాటికి ఎస్‌బిఐ 3.27 కోట్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులున్నారు. దాదాపు 2 కోట్ల మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులు నమోదయ్యారు. చిన్న లావాదేవీలను ప్రోత్సహించడంతోపాటు, జిఎస్‌టి నేపథ్యంలో ఐఎంపీఎస్(ఇమ్మీడియేట్ పేమేంట్ సర్వీస్) లపై కొత్త చార్జీలను ఎస్‌బిఐ ప్రకటించింది.
రూ.1000లకు ఎలాంటి ఛార్జీలు లేకుండానే నగదును బదిలీ చేయనున్నారు. రూ.1000 నుండి రూ.1లక్షవరకు రూ. 5లతోపాటు రూ.5లు, జిఎస్‌టి, రూ.1 లక్ష నుండి రూ. 2 లక్షల నగదు బదిలీకి రూ.15లతోపాటు జిఎస్‌టి ఛార్జీలను వసూలు చేయనున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications