బలవంతంగా అప్పు వసూలు చేస్తే 5 ఏళ్లు జైలు శిక్ష.. రూ.5లక్షల జరిమానా.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
అవసరానికి డబ్బు అందరి దగ్గరా ఉండదు. అందుకే అనేకమంది అప్పు చేస్తుంటారు. మరి కొందరు అవసరం ఉన్నా లేకున్నా అప్పు చేసి పప్పు కూడు తింటుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు నిత్యం అనేక మంది అప్పు చేయడం మనం చూస్తుంటాం. అయితే ఆ అప్పును తిరిగి ఇచ్చే సమయంలో నానా ఇబ్బందులు పడుతుంటారు ప్రజలు. ఇక అప్పు తీర్చకపోతే బెదిరింపులకు పాల్పడుతుంటారు యజమానులు. బలవంతంగానైనా అప్పులు వసూలు చేస్తుంటారు.
అయితే తీసుకున్న అప్పును బలవంతంగా వసూలు చేస్తే ఇకపై 5 ఏళ్లు జైలు శిక్ష విధించనుంది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాక రూ. 5 లక్షల జరిమానా కూడా విధించనుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టారు. అయితే తాజాగా ఈ బిల్లుకు తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదం తెలిపారు.
దేశంలో సామాన్య రైతుల నుంచి చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు ఇలా నిత్యం లక్షలాది మంది నిత్యం అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులు తీర్చే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కొందరు యజమానులు మాత్రం ప్రజలకు అప్పులు ఇచ్చి వాటి నుంచి వచ్చే వడ్డీతోనే కాలం వెళ్లదీస్తూ ఉంటారు. డబ్బు ఇంట్లోనే ఉంటే ఎలాంటి లాభం లేదని.. అడిగిన వారికి అప్పులిస్తూ ఆ తర్వాత వారి నుంచి బలవంతంగా వసూలు చేస్తూ ఉంటారు.
ఈ మధ్య తమిళనాడులో రుణ దాతల నుంచి వేధింపులు అధికం అయ్యాయి. సామాన్య రైతుల నుంచి చిరు వ్యాపారుల వరకు ఈ సమస్య అధికంగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొన్ని ఫైనాన్స్ సంస్థల నుంచి ఈ వేధింపులు నానాటికీ రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. అనేక మంది అప్పులు తీర్చలేక.. రుణ దాతలు, ఫైనాన్స్ సంస్థలు పెట్టే బాధలు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో ఏప్రిల్ 26 వ తేదీన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. 'తమిళనాడు నిషేధిత బలవంతపు రుణ వసూలు బిల్లు 2024' గా అభివర్ణించారు. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా రుణ దాతలు అప్పు తీర్చమని ప్రజలు వేధింపులకు గురిచేస్తే కపై 5 ఏళ్లు జైలు శిక్ష విధించనుంది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాక రూ. 5 లక్షల జరిమానా కూడా విధించనుంది. తాజాగా ఈ బిల్లుకు తమిళనాడు గవర్నర్ ఆర్. ఎన్. రవి ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇది చట్ట రూపం దాల్చింది.

ఈ బిల్లు ప్రకారం అప్పు తీసుకున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు, బంధువులను వేధించకూడదు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకోకూడదు. అలా చేస్తే కొత్త చట్టం ప్రకారం 5 ఏళ్లు జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధించబడుతుంది. ఒకవేళ వేధింపులు తాళలేక ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే.. అప్పు ఇచ్చిన వ్యక్తి లేదా సంస్థే వారి ఆత్మహత్యకు కారణంగా భావిస్తారు. తాజాగా ఈ బిల్లు చట్ట రూపం దాల్చడంతో అనేక మంది ఉపశమనం కలిగించినదిగా భావించవచ్చు.












Click it and Unblock the Notifications