Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నర్సులు, నర్సింగ్ స్టాఫ్ కు బంపర్ ఆఫర్

ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేస్తున్న నర్సులు, ఇతర సిబ్బందికి భారీ వేతన పెంపును ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సవరించిన వేతనాలతో కూడిన పూర్తి ముసాయిదా ఈ సాయంత్రానికి వెలువడనుంది. ఆరోగ్య రంగ ఉద్యోగులకు ఇది అతి పెద్ద విజయం. యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్ విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

తమ వేతనాలను పెంచాలంటూ మూడు రోజులుగా కేరళకు చెందిన నర్సులు, ఇతర నర్సింగ్ స్టాఫ్ ఆందోళనలు చేపడుతున్నారు. తిరువనంతపురంలోని సచివాలయం ముందు బైఠాయించారు. దీన్ని మరింత తీవ్రతరం చేస్తామనీ హెచ్చరించారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రకటించారు. జిల్లా కేంద్రాల్లో నిరవధిక రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య పినరయి విజయన్ ప్రభుత్వం తాజా నిర్ణయాలు తీసుకుంది.

State Government Raises Private Hospital Nurses Pay with Minimum Wages Jump to Rs 25450 to Rs 28000

ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తోన్న నర్సులు, నర్సింగ్ స్టాఫ్ అందుకుంటోన్న బేసిక్ పే ప్రస్తుతం 20,000 రూపాయలుగా ఉంటోంది. ఈ కనీస మూల వేతనాన్ని 25,450 నుండి 28,000 రూపాయల వరకు పెంచింది కేరళ ప్రభుత్వం. అలాగే- హెడ్ నర్స్ లేదా అంతకంటే సీనియర్ ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి జీతాలు 33,080 రూపాయల వరకు పెరుగుతాయి. 2018 తర్వాత నర్సుల మూల వేతనాన్ని ప్రభుత్వం సవరించడం ఇదే తొలిసారి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వీరితో పాటు అటెండెంట్లు, సెక్యూరిటీ సిబ్బంది, స్టోర్‌ కీపర్లు, స్వీపర్లతో సహా నర్సింగ్ యేతర సిబ్బందికి కూడా ఈ వేతన పెంపును ప్రభుత్వం వర్తింపజేసింది. వారికి కనీస నెలవారీ వేతనం 23,650 రూపాయలుగా నిర్ణయించింది. తద్వారా అందరికీ సరైన పరిహారం అందేలా చూసింది. ప్రస్తుతం కేరళలోని ప్రైవేట్ ఆసుపత్రులలో నర్సులకు 2018 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి వేతన సవరణ జరగాలి. గత ఎనిమిదేళ్లుగా వేతన సవరణ జరగట్లేదు.

దీంతో సమాన పనికి సమాన వేతనం నినాదంతో యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్ నిరసన ప్రదర్శనలకు దిగింది. ప్రైవేట్ రంగ నర్సులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఉండాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసింది. ఆసుపత్రి యాజమాన్యాలతో జరిగిన చర్చలు విఫలమవడంతో, కనీస వేతనం పెంపుపై నిర్వహించిన సమావేశాలకు ప్రతినిధులు హాజరుకాకపోవడంతో తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని మంత్రి శివన్‌కుట్టి స్పష్టం చేశారు. పెరిగిన వేతనాల ముసాయిదా నేడు విడుదల అవుతుందని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+