వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రాష్ట్రాలపై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్‌కాంత్ సంచలన వ్యాఖ్యలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్‌, యూపీ, ఛత్తీస్‌గఢ్‌ లాంటి రాష్ట్రాలు దేశ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. జమియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బీహార్‌, యూపీ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలు భారత ఆర్థికాభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. ముఖ్యంగా సామాజిక సూచీలో ఆయా రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విద్య,ఆరోగ్య వ్యవస్థలు ఆయా ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకున్నాయన్నారు.

States like Uttar Pradesh, Bihar holding India back: NITI Aayog CEO Amitabh Kant

ఐదో తరగతి పిల్లాడికి చదువుల్లో కనీస పరిజ్ఞానం లేకుండా పోతోంది. చదువుతోపాటు పిల్లల ఆరోగ్య స్థితులను అక్కడి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. మహిళల విషయంలో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఓవైపు మేము ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను పెంపొందించేందుకు కృషి చేస్తుంటే.. మానవాభివృద్ధి సూచిక కలవరపెడుతోందని అమితాబ్‌ కాంత్ అభిప్రాయపడ్డారు.

మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)లో మొత్తం 188 దేశాలకు గానూ భారత్‌ 131వ స్థానంలో ఉంది. అయితే దక్షిణ భారతంలో, ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం చాలా వేగవంతంగా అభివృద్ధి జరుగుతోంది. హెచ్‌డీఐలో భారత్‌ స్థితి మెరుగుపడితేనే సామాజిక సూచీ విషయంలో మేం ఏమైనా చేయగలుగుతామన్నారు.. అప్పటిదాకా పరిస్థితుల్లో మార్పుండని ఆయన అభిప్రాయపడ్డారు..

English summary
NITI Aayog CEO Amitabh Kant on Tuesday said that the states in India's eastern region like Bihar, Uttar Pradesh, Chattisgarh, Madhya Pradesh and Rajasthan are keeping India backward, especially on social indicators.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X