ఉత్తరాఖండ్: అన్ని ముఖాముఖీ పోటీలే.. రెబెల్స్‌పై బీజేపీ వేటు..

ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం 10 రోజుల గడువు ఉంది. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిజెపి మధ్య ముఖాముఖీ పోటీలే మిగిలాయి.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం 10 రోజుల గడువు ఉంది. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిజెపి మధ్య ముఖాముఖీ పోటీలే మిగిలాయి. ఈ నెల 15న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 70 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపిలకు పరస్పరం తిరుగుబాటు అభ్యర్థులు ఉండటం ఆందోళనకరమే.

ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రధాన రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ, బిజెపి మధ్యే ఊగిసలాడాయి. పరస్పరం అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బిజెపిలలోని కొందరు శక్తిమంతమైన నేతలకు టిక్కెట్లు ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇరు పార్టీల్లోనూ కలిపి 18 మంది నాయకులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచారు.

అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున పోటీ చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ కూడా ముగ్గురు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలను తమ పార్టీ అధికారిక అభ్యర్థులుగా బరిలోకి దించింది. ఇరు పార్టీలు తమకు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో మద్దతు ఉన్నదని ప్రకటించుకోవడం గమనార్హం. గమ్మత్తేమిటంటే ఇరు పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉండగా.. బిజెపి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గణనీయ సంఖ్యలో పార్టీ నేతలను ఆరేళ్లపాటు బహిష్కరించింది.

రెండు జిల్లాల్లో శక్తిగా బీఎస్పీ సవాల్

రెండు జిల్లాల్లో శక్తిగా బీఎస్పీ సవాల్

అయితే హరిద్వార్, ఉద్ధంసింగ్ నగర్ జిల్లాల్లో మాత్రం మాయావతి సారథ్యంలోని బీఎస్పీ రెండు పార్టీల మధ్య పోటీ పడుతోంది. ఈ రెండు జిల్లాల పరిధిలోని 20 స్థానాల్లో క్షేత్రస్థాయిలో గట్టి పునాది కలిగి ఉన్న బీఎస్పీ.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపిలకు సవాల్ విసురుతోంది. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఇరు పార్టీల్లోనూ 50 స్థానాల్లో కొందరు నేతలు తిరుగుబాటు చేశారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. వారు పోటీ నుంచి ఉపసంహరించుకోవడంతో ఆయా స్థానాల్లో బరిలోకి దిగిన ఆయా పార్టీల విజయావకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపిలు పరస్పరం 25 మంది పార్టీ నేతలను బహిష్కరించాయి. బీజేపీలో 11 స్థానాలకు తిరుగుబాటు అభ్యర్థులు గట్టి పోటీనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థులకు ఆర్యేంద్ర శర్మ, రజనీ రావత్, శూర్వీర్ సింగ్ సాజ్వన్‌లకు పోటీగా తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నారు.

రెండు జిల్లాల్లో శక్తిగా బీఎస్పీ సవాల్

రెండు జిల్లాల్లో శక్తిగా బీఎస్పీ సవాల్

అయితే హరిద్వార్, ఉద్ధంసింగ్ నగర్ జిల్లాల్లో మాత్రం మాయావతి సారథ్యంలోని బీఎస్పీ రెండు పార్టీల మధ్య పోటీ పడుతోంది. ఈ రెండు జిల్లాల పరిధిలోని 20 స్థానాల్లో క్షేత్రస్థాయిలో గట్టి పునాది కలిగి ఉన్న బీఎస్పీ.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపిలకు సవాల్ విసురుతోంది. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఇరు పార్టీల్లోనూ 50 స్థానాల్లో కొందరు నేతలు తిరుగుబాటు చేశారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. వారు పోటీ నుంచి ఉపసంహరించుకోవడంతో ఆయా స్థానాల్లో బరిలోకి దిగిన ఆయా పార్టీల విజయావకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపిలు పరస్పరం 25 మంది పార్టీ నేతలను బహిష్కరించాయి. బీజేపీలో 11 స్థానాలకు తిరుగుబాటు అభ్యర్థులు గట్టి పోటీనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థులకు ఆర్యేంద్ర శర్మ, రజనీ రావత్, శూర్వీర్ సింగ్ సాజ్వన్‌లకు పోటీగా తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నారు.

 ప్రీతం సింగ్‌కు కాంగ్రెస్ మద్దతు

ప్రీతం సింగ్‌కు కాంగ్రెస్ మద్దతు

అయితే ధానౌల్టీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రీతం సింగ్ పన్వర్ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మద్దతు పలికింది. అంతకుముందు నామినేషన్ దాఖలు చేసిన మన్మోహన్ మాల్ వైదొలిగేందుకు సిద్ధంగా లేకపోవడమే దీనికి కారణం. ఉత్తరాఖండ్ రాష్ట్రావిర్భావం తర్వాత నాలుగోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. పరస్పరం కాంగ్రెస్, బిజెపిలు చెరోసారి అధికారాన్ని చేపట్టాయి. కానీ ఈ సారి కాంగ్రెస్, బిజెపి మాత్రం ఎవరికి వారే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

గార్హ్వాల్‌లో పట్టున్న నేత సజ్వాన్

గార్హ్వాల్‌లో పట్టున్న నేత సజ్వాన్

గార్హ్వాల్ రీజియన్‌లో పేరొందిన ఠాకూర్ల నాయకుడు సజ్వాన్. 2002లో ఎన్ డి తివారీ సారథ్యంలోని తొలి రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 1985 నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దేవ్ ప్రయాగ్, తెహ్రీ, రిషికేశ్ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. దేవ్ ప్రయాగ్ స్థానం నుంచి 2012 ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థి మంత్రి ప్రసాద్ నైథానీ చేతిలో కాంగ్రెస్ అధికార అభ్యర్థిగా సజ్వాన్ ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ సజ్వాన్ స్థానే నైథానికి టిక్కెట్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీకి దిగారు.

ఎన్ డి తివారీ విధేయుడు ఆర్యేంద్రకు మొండిచేయి

ఎన్ డి తివారీ విధేయుడు ఆర్యేంద్రకు మొండిచేయి

మాజీ సీఎం ఎన్ డి తివారీ మరో విధేయుడు ఆర్యేంద్ర శర్మకు కూడా కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసేసింది. తివారీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తించిన ఆర్యేంద్ర శర్మ తొలిసారి 2012 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ సహస్పూర్ స్థానం నుంచి మరోసారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. ఉత్తరాఖండ్ పీసీసీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయకు టిక్కెట్ కేటాయించడంతో ఆర్యేంద్ర సైతం స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంతేకాదు టిక్కెట్ నిరాకరించినందుకు ఆర్యేంద్ర శర్మ మద్దతుదారులు పీసీసీ భవన్ ముందు ఆందోళన కూడా చేశారు.

 ట్రాన్స్‌జెండర్ రజనీ రావత్‌కు ప్రభులాల్ బహుగుణ నుంచి పోటీ

ట్రాన్స్‌జెండర్ రజనీ రావత్‌కు ప్రభులాల్ బహుగుణ నుంచి పోటీ

2008లో డెహ్రాడూన్ మేయర్ ఎన్నికల్లో 44 వేల ఓట్లు పొందిన ట్రాన్స్ జెండర్ రజనీ రావత్.. 2013లో దాన్ని 46,689 ఓట్లకు పెంచుకున్నారు. కానీ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించకున్నా తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం రాయిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్న రజనీ రావత్‌కు ప్రత్యర్థిగా ప్రభులాల్ బహుగుణ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలవడం గమనార్హం.

 బీజేపీ నుంచి ఎనిమిది మంది నేతల బహిష్కరణ

బీజేపీ నుంచి ఎనిమిది మంది నేతల బహిష్కరణ

తిరుగుబాటు చేసి స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీలో ఉన్న ఎనిమిది మంది నేతలను బిజెపి బహిష్కరించింది. గంగోత్రి స్థానం నుంచి సూరత్ రామ్ నౌట్యాల్, కేదరినాథ్ లో ఆశా నౌత్యాలు, ఘంసాలిలో ఘనీలాల్ షా, నరేంద్ర నగర్ స్థానంలో ఓం గోపాల్ రావత్, రాణిఖేట్ స్థానం నుంచి ప్రమోద్ నైన్ వాల్, నైనిటాల్ స్థానంలో హెమ్ హార్యా, చౌబట్టాఖాల్ స్థానం నుంచి కవీంద్ర ఇస్తవాల్, దిదిహట్ స్థానంలో కిషాన్ సింగ్ భండారీ బిజెపి నుంచి బహిష్కరణకు గురైన నేతలు. ఐదేళ్ల క్రితం బిజెపిలో చేరిన ఒకప్పటి ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ పార్టీ వ్యవస్థాపక నేత దివాకర్ భట్‌నూ కాషాయ పార్టీ బహిష్కరించింది.

కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే బీజేపీకే నష్టం

కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే బీజేపీకే నష్టం

రాణిఖేట్, నరేంద్ర నగర్, ఛౌబట్టాఖాల్, కేదరీనాథ్ నియోజకవర్గాల పరిధిలో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన బిజెపి నేతలు గణనీయ స్థాయిలో ఓట్లను చీల్చగల సామర్థ్యం గల వారు. కనుక అధికార కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి ఈ స్థానాల్లో నష్టం ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నరేంద్ర నగర్ స్థానంలో సుబోధ్ ఉనియాల్ విజయావకాశాలను ఓం గోపాల్ రావత్ దెబ్బ తీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, కేదరీనాథ్‌లో శైలా రాణి రావత్ అభ్యర్థిత్వానికి ఆశా నౌతియాల్, రాణిఖేట్‌లో అజయ్ భట్ గెలుపును ప్రమోద్ నైనివాల్, చౌబట్టాఖాల్ స్థానంలో సత్పాల్ మహారాజ్ విజయావకాశాలను కవీంద్ర ఇస్తవాల్ గణనీయంగా దెబ్బతీస్తారని ఉదిత్ ఘిల్దియాల్ అనే రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.

 నరేంద్రనగర్‌లో కీలక యువనేత ఓంగోపాల్ రావత్

నరేంద్రనగర్‌లో కీలక యువనేత ఓంగోపాల్ రావత్

నరేంద్ర నగర్ స్థానం పరిధిలో క్షేత్రస్థాయిలో జనం మద్దతు గల నేత ఓం గోపాల్ రావత్. 2012 ఎన్నికల్లో ఓటమి పాలైనా.. గత ఏడాది బీజేపీ గూటికి చేరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుబోధ్ ఉనియాల్‌కు సవాల్‌గా నిలిచారు. అలాగే ప్రమోద్ నైనీవాల్.. తిరుగుబాటు అభ్యర్థిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ అభ్యర్థిత్వానికి సవాల్‌గా నిలిచారు. క్రితంసారి కేవలం 78 ఓట్లతో ఓటమి పాలైన భట్.. ఈ దఫా నైనీవాల్ నుంచి గట్టి పోటీనెదుర్కొంటున్నారు.

ఆశా నౌతియాల్ వర్సెస్ శైలారాణి రావత్

ఆశా నౌతియాల్ వర్సెస్ శైలారాణి రావత్

కేదరీనాథ్ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆశా నౌతియాల్.. సిట్టింగ్ ఎమ్మెల్యే (కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన నేత) శైలా రాణి రావత్ విజయావకాశాలను తప్పనిసరిగా సవాల్ చేసే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు.

 సత్పాల్ మహరాజుకి కవీంద్ర ఇస్తవాల్ సవాల్

సత్పాల్ మహరాజుకి కవీంద్ర ఇస్తవాల్ సవాల్

చౌబత్తాఖాల్ స్థానం నుంచి కవీంద్ర ఇస్తవాల్ అభ్యర్థిత్వానికి పార్టీ నేతలు కొందరు మద్దతు పలుకడంతో అధికారిక అభ్యర్థి సత్పాల్ మహారాజ్ లభించే ఓట్లలో కోత పడుతుందని అంచనా వేస్తున్నారు. కానీ బిజెపి మాత్రం తిరుగుబాటు అభ్యర్థుల వల్ల తమ విజయావకాశాలపై ప్రభావం చూపదని గంభీర వ్యాఖ్యలు చేస్తోంది. పార్టీ మద్దతు లేని వారే తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచారని బిజెపి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేశ్ బన్సాల్ పేర్కొన్నారు.

33 మంది నేతలపై బీజేపీ ఆరేళ్ల బహిష్కరణ వేటు

33 మంది నేతలపై బీజేపీ ఆరేళ్ల బహిష్కరణ వేటు

సరిగ్గా పోలింగ్ తేదీకి పది రోజుల ముందు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బిజెపి ఏకంగా 33 మంది పార్టీ నేతలను ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు వారిని తొలగించినట్లు బిజెపి రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి నరేశ్ బన్సాల్ తెలిపారు. తక్షణం సస్పెన్షన్ వేటు అమలులోకి వస్తుందని చెప్పారు. గంగోత్రి అసెంబ్లీ స్థానం పరిధిలోని నేతలు మురళీలాల్ భట్, సత్యేంద్ర సింగ్ రాణా, మహేశ్ పన్వర్, బుద్ధిసింగ్ పన్వర్, జాఫ్మోహన్ రావత్, బిహారీలాల్ నౌతియాల్, దినేశ్ సేమ్వాల్, విజయ్ బహదూర్ సింగ్ రావత్, హరీశ్ నౌతియాల్, కుశాల్ సింగ్ నౌతియాల్, ఘ్రిపాల్ పొఖ్రియాల్, రమేశ్ సేమ్వాల్, గిరిష్ రామోలాలను తొలగించినట్లు తెలిపారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర చీఫ్ అజయ్ భట్ స్పందిస్తూ వీరంతా అత్యాశాపరులని వ్యాఖ్యానించారు. బిజెపి క్రమశిక్షణ గల పార్టీ అని పేర్కొన్నారు. వీరివల్ల ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+