వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింత శిశువు జననం .. తల పంది తల ఆకారంలో , ఒళ్లంతా పొలుసులతో .. వైద్యులు షాక్

|
Google Oneindia TeluguNews

ఒడిశా రాష్ట్రంలో ఒక వింత శిశువు జన్మించింది. బట్టకుమరా గ్రామానికి చెందిన ఒక గర్భిణికి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా 2.40 కిలోల బరువున్న శిశువుకి ఆమె జన్మనిచ్చింది. అయితే ఆ శిశువును చూసిన వారంతా షాక్ కు గురయ్యారు.చూడటానికి చాలా భయంకరంగా ఆ శిశువు రూపం ఉంది .

 శిశువు తల పంది తల ఆకారంలో, ఒళ్లంతా పొలుసులు

శిశువు తల పంది తల ఆకారంలో, ఒళ్లంతా పొలుసులు

శిశువు తల పంది తల ఆకారంలో ఉంది. ఇక చర్మంపై పొలుసులు ఉండి అవి ఊడిపోతున్నట్లు గా కనిపిస్తుంది.
వింత శిశువు జననంతో చోటు చేసుకున్న విచిత్రమైన సంఘటనపై గంజాం జిల్లాలోని ఎంకెసిజి మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రి వర్గాలు హార్లేక్విన్ ఇచ్టిహయోసిస్ అనే అరుదైన జన్యు రుగ్మతతో శిశువు జన్మించిందని వెల్లడించారు. అయితే ఇలాంటి శిశువులు జన్మించినప్పటికీ ఎక్కువ సేపు బ్రతికి ఉండరు. కానీ ఇప్పటివరకు జీవించి ఉన్న శిశువు వైద్యులు, నర్సులు మరియు ఇతర వైద్య సిబ్బందిని ఆశ్చర్యపరిచింది.

 10 లక్షల మంది శిశువుల్లో ఎవరో ఒకరికే ఇలాంటి జన్యు లోపం

10 లక్షల మంది శిశువుల్లో ఎవరో ఒకరికే ఇలాంటి జన్యు లోపం


నివేదికల ప్రకారం,ఈ వింత నవజాత శిశువుకు కొన్ని రోజులు జీవించడానికి క్లిష్టమైన వైద్య సహాయం అవసరం అని పేర్కొన్నారు. అధ్యయనాల ప్రకారం, ఈ విధంగా శిశువు జన్మించడం ఒక రకమైన వ్యాధి, ఇది ఐదు నుండి 10 లక్షల మంది నవజాత శిశువులలో అరుదుగా ఎవరో ఒకరికి వస్తుందని చెప్తున్నారు. అటువంటి అరుదైన జన్యు రుగ్మతతో జన్మించిన శిశువుల మనుగడకు అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు వైద్యులు .

నాగ్‌పూర్‌లో 2016 లో కూడా ఇదే లక్షణాలతో శిశువు జననం .. కొద్దిరోజులకే మృతి

నాగ్‌పూర్‌లో 2016 లో కూడా ఇదే లక్షణాలతో శిశువు జననం .. కొద్దిరోజులకే మృతి

ఏదేమైనా, అధునాతన నియోనాటల్ కేర్‌తో వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందటంతో అటువంటి శిశువులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు.

ఇంతకుముందు, గతంలో కూడా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 2016 లో ఇలాంటి ఒక కేసు నమోదైంది,అప్పుడు కూడా ఆ శిశువు ఇవే లక్షణాలతో జన్మించింది . ఇలా పండి ఆకారపు తలతో , ఒళ్లంతా పొలుసులతో అరుదైన వ్యాధితో బాధపడుతున్న మొదటి శిశువు అని భావించారు. అప్పుడు ఆ శిశువు చాలా రోజులు బ్రతక లేదు . పుట్టిన కొన్ని రోజుల తరువాత వ్యాధి బారిన పడి మరణించింది.

English summary
In a strange event, a baby was born at MKCG Medical College and Hospital here in Ganjam district with a rare genetic disorder .The new born baby head is like pig's head and body looks like Scales.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X