ప్రియురాలి అభ్యంతరకర ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

కోయంబత్తూరు: మాజీ ప్రియురాలి అభ్యంతరకర ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు గురి చేసిన ఓ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 19ఏళ్ల వయస్సున్న నిందితుడు గౌతమ్ ఓ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న ఓ అమ్మాయితో అతడు ప్రేమ వ్యవహారం నడిపాడు.

కొంత కాలంపాటు వారి ప్రేమాయణం సజావుగానే సాగింది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి చాలా ఫొటోలు దిగారు. వాటిలో కొన్ని అభ్యంతరకరమైన కూడా ఉన్నాయి. ఈ ఫొటోలను ఆసరా చేసుకుని ఆ అమ్మాయి నుంచి డబ్బు గుంజాలనుకున్నాడు గౌతమ్.

Student held for posting obscene pictures of ex-girl friend in Coimbatore

ఒక లక్ష రూపాయలు తనకు ఇవ్వాలని, లేకపోతే ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని గౌతమిని బెదిరించడం ప్రారంభించాడు.

ఈ తాటాకు చప్పుళ్లకు తానేమి బెదరనని ఆ యువతి సమాధానం చెప్పింది. దీంతో ఖంగుతిన్న ఆ యువకుడు వారిద్దరూ దిగిన ఒక అభ్యంతరకర ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. దీంతో, గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ యిచ్చి వదిలిపెట్టారు. కానీ, అతని ప్రవర్తనలో ఏ మార్పు రాకపోవడంతో యువకుడిని మళ్లీ అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+