లేడీ కంప్యూటర్ టీచర్ చెంప చెళ్లుమనిపించిన విద్యార్థి

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ విద్యా సంస్థలో 12వ తరగతి విద్యార్థి తన మహిళా కంప్యూటర్ టీచర్‌ను కొట్టాడు. దుష్ప్రవర్తనకు మందలించడంతో అతను టీచర్‌పై చేయి చేసుకున్నాడు. సోమవారం తరగతి నడుస్తున్న సమయంలో ఆ విద్యార్థి కంప్యూటర్లకు విద్యుత్తు అందించే మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేశాడు. అందుకు గాను, అతన్ని టీచర్ మందలించింది.

సరిగా ప్రవర్తించడం నేర్చుకోవాలని ఆమె అతనితో చెప్పింది. దాంతో విద్యార్థి రెచ్చిపోయి టీచర్‌పై చేయి చేసుకున్నాడని పేరు చెప్పడానికి ఇష్టపడని పాఠశాల అధికారి చెప్పారు. గతంలో కూడా ఆ విద్యార్థి దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయని, క్షమాపణ చెప్పిన తర్వాత పాఠశాలలో కొనసాగడానికి అతనికి అనుమతి ఇచ్చారని ఆ అధికారి చెప్పారు.

 Student slaps teacher in Tamil Nadu

తాజా సంఘటనపై జిల్లా విద్యాధికారులకు నివేదించారు. సీనియర్ అధికారులు సంఘటనపై విచారణ జరిపారు. విద్యార్థిపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే, పాఠశాల అధికారులు పోలీసులకు ఏ విధమైన ఫిర్యాదు కూడా చేయలేదు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించుకున్నారు.

తాము ఫిర్యాదు చేయదలుచుకోలేదని పాఠశాల అధికారులు చెప్పినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఉపాధ్యాయురాలిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఎడమ చెవికి చాలా దగ్గరగా దెబ్బ తగలడంతో ఆమెకు లోపలి భాగంలో దెబ్బ తగిలి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+