సుబ్రమణ్యస్వామి సంచలనం: మద్యం ముట్టుకోవద్దు, స్వదేశీ దుస్తులు ధరించాలి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మద్యం ముట్టుకోకుండా, విదేశీ దుస్తులు ధరించకుండా బిజెపి మంత్రులను పార్టీ ఆదేశాలు జారీ చేయాలని ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కోరారు.భారతీయ వాతావరణానికి అనుకూలంగా దుస్తులను ధరించాలని సుబ్రమణ్యస్వామి పార్టీ ఎంపీలకు సూచించారు.

విదేశీ దుస్తులు ధరించడమంటేనే విదేశీయులకు భానిసలుగా లొంగిపోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 49 మద్యపానాన్ని నిషేధించాలని సూచిస్తోంది. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకోవడం లేదన్నారు. కానీ బీజేపీ తన క్రమశిక్షణలో దీనిని కూడా భాగం చేసుకోవాలని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్‌ చేశారు.

Subramanian Swamy has a suggestion on what BJP ministers must wear

పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో జరిగిన పండిట్‌ మదన్‌ మోహన్‌ మాల్వియా జయంతి ఉత్సవాల్లో ఎన్డీయే మంత్రులు పాల్గొనలేదని సుబ్రహ్మణ్యస్వామి సోమవారం ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ మంత్రులు వెస్ట్రన్‌ దుస్తులు ధరించకూడదంటూ స్వామి ట్వీట్‌ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Controversial Bharatiya Janata Party (BJP) leader Subramanian Swamy on Tuesday suggested his party to ban western clothes for ministers. Taking to Twitter, the politician also had a suggestion on liquor ban for the BJP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి