భారత్‌కు వద్దు!: రఘురాంరాజన్‌పై స్వామి సంచలనం
ముంబై: భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి గురువారం నాడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (ఆర్బీఐ) రఘురామ్ రాజన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రఘురాం రాజన్‌ను చికాగోకు పంపించాలని ధ్వజమెత్తారు.
రఘురాం రాజన్ భారత్‌కు అనుకూలుడు కాదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రఘురాం రాజన్ అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలు దేశానికి నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన విధానాలే దేశంలో తీవ్రతరమైన నిరుద్యోగ సమస్యకు కారణమన్నారు.

అంతేకాదు, రాజన్‌కు ఇక సెలవు ఇచ్చేస్తే మంచిదన్నారు. వడ్డీ రేట్లు పెంచాలని రాజన్ చేస్తోన్న ఆలోచన దేశం నష్టపోవడానికి కారణం అవుతోందన్నారు. అతను సాధ్యమైనంత త్వరగా చికాగో పంపించాలని సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications