మా కష్టాలు తీర్చండి సార్: ఇన్ని రోజులు నిద్రపోతున్నావా అంటూ మహిళపై సీఎం సెటైర్లు!

బెంగళూరు: తన కష్టాలు తీర్చాలని వేడుకున్న మహిళ పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అనుచితంగా ప్రవర్తించడంతో రైతులు మండిపడుతున్నారు. నీ కష్టాలు ఇంతకాలం ఎందుకు చెప్పలేదని, హాయిగా నిద్రపోతున్నావా ? అంటూ సీఎం కుమారస్వామి అనడంతో మహిళలతో పాటు అధికారులు స్థానికులు షాక్ కు గురైనారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హెచ్.డి. కుమారస్వామి మహిళను కించపరిచి మాట్లాడారని, వెంటనే ఆయన రాజీనామా చెయ్యాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తాను మహిళను అలా అనేలేదని, బహిరంగ క్షమాపణ చెబుతున్నానని సీఎం కుమారస్వామి వివరణ ఇచ్చారు.

సోమవారం మద్యాహ్నం రెండు గంటల లోపు బెంగళూరు నగరంలోని ఫ్రీడం పార్క్ లోకి వచ్చి మహిళా రైతులకు క్షమాపణలు చెప్పాలని, మా సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు.

Sugar cane and paddy farmers are holding massive protest near Vidhana soudha.

కర్ణాటకలో అన్నాదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, చెరుకు రైతులకు చెల్లించాల్సిన రుణాలు వెంటనే చెల్లించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మండ్య, మైసూరు, రామనగర జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని .జిల్లాల రైతులు ఒక్కసారిగా సోమవారం ఉదయం బెంగళూరు రైల్వేష్టేషన్ చేరుకున్నారు.

రైల్వేష్టేషన్, మెజస్టిక్ నుంచి ఫ్రీడం పార్క్ కు దాదాపు 50 వేల మంది అన్నదాతలు ర్యాలీగా బయలుదేరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం, సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు నినాదాలు చేశారు. అన్నదాతలు అర్థనగ్నంగా నిరసన వ్యక్తం చెయ్యడంతో పోలీసులు వారిని అరెస్టు చెయ్యడానికి ప్రయత్నించారు.

మండ్య జిల్లాలోని నాలుగు షుగర్ ఫ్యాక్టరీలు (చక్కెర ఫ్యాక్టరీలు) రైతులకు రూ. 100 కోట్లకు పైగా చెల్లించాల్పిన నిధులు ఇవ్వలేదని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మైషుగర్స్ ఫ్యాక్టరీ రూ. 7.64 కోట్లు, భారతీనగర్ చాముండేశ్వరి షుగర్స్ రూ. 33. 81 కోట్లు, కోప్పళ ఎన్ఎస్ఎల్ షగర్స్ రూ. 97.06 కోట్లు చెల్లించాలని రైతులు ఆరోపించారు.

రైతులకు చెల్లించాల్సిన రూ. 2.661 కోట్లు ఇంత వరకూ చెల్లించలేదని అన్నదాతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు కలిపి చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. సీఎం కుమారస్వామి సంఘటనా స్థలానికి రాకపోతే పరిస్థితులు విషమంగా ఉంటాయని రైతులు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+