మండ్యలో సుమలతకు చాన్స్: కేంద్ర మంత్రి పదవి, అదృష్టం: బసవానంద స్వామిజీ, సీఎం కొడుకు!
బెంగళూరు: కర్ణాటకలో మండ్య లోక్ సభ నియోజక వర్గం ఫలితాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి, స్వతంత్ర పార్టీ అభ్యర్థి, బహుబాష నటి సుమలతలో ఎవరు గెలుస్తారు అని చర్చ జరుగుతోంది. సుమలత అంబరీష్ విజయం సాదించి కేంద్రంలో మంత్రి పదవి చేపడతారని ప్రముఖ స్వామిజీ జోస్యం చెప్పారు.

స్వామిజీ జోస్యం
మండ్యలో స్వతంత్ర పార్టీ అభ్యర్థి సుమలత భారీ విజయం సాదించి కేంద్రంలో మంత్రి అవుతారని బీదర్ జిల్లా బసవకల్యాణ బసవధర్మ ప్రసారక శ్రీ బసవానంద స్వామిజీ జోస్యం చెప్పడంతో ఇప్పుడు భారీ స్థాయిలో చర్చ మొదలైయ్యింది. సర్వసంగ పరిత్యాగిగా గుర్తింపు పొందిన స్వామిజీ బహిరంగంగా సుమలత విజయం సాదించి కేంద్ర మంత్రి అవుతారని జోస్యం చెప్పడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మనసు గెలిచిన సుమలత
శ్రీ బసవానందస్వామిజీ మీడియాతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల సమయంలో సుమలత మండ్య ప్రజల మనసు గెలుచుకున్నారని అన్నారు. ఎంతో ఓపికగా ఎన్నికల ప్రచారం చేసిన సుమలత ఎవ్వరికి భాద కలిగే విదంగా మాట్లాడలేదని, అన్నివర్గాల వారిని గౌరవించి ఎన్నికల ప్రచారం చేశారని స్వామిజీ అన్నారు. అందరి మనసులు గెలుచుకున్న సుమలతనే మండ్యలో విజయం సాదిస్తారని స్వామిజీ జోస్యం చెప్పారు.

కేంద్రంలో సముచితస్థానం
మండ్యలో 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ ఎక్కువ జరిగిందని స్వామిజీ గుర్తు చేశారు. ఎక్కువ పోలింగ్ జరగడంతో సుమలతకు అనుకూలంగా మారిందని స్వామిజీ అన్నారు. ఈ పూర్తి అంశాలను పరిశీలిస్తే సుమలత గెలుపు కచ్చితం అని స్వామిజీ చెప్పారు. సుమలత శక్తి సామార్థ్యాలు గుర్తించి కేంద్రంలో ఉన్నత స్థాయి మంత్రి పదవి అప్పగిస్తారని, అందులో ఎలాంటి అనుమానం లేదని స్వామిజీ అన్నారు. సుమలతకు రాజకీమ భవిష్యత్తు సవ్యంగా ఉందని, తాను కూడా రెండు రోజులపాటు మండ్యలో ఆమెకు మద్దతుగా ప్రచారం చేశానని స్వామిజీ వివరించారు.

యడ్యూరప్పకు చాన్స్
కేంద్రంలో మళ్లీ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ భాద్యతలు స్వీకరిస్తారని స్వామిజీ అన్నారు. కర్ణాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్వామిజీ అన్నారు. వారణాసిలో నరేంద్ర మోడీ భారీ మెజారిటీతో విజయం సాదిస్తారని స్వామిజీ చెప్పారు. మే 23వ తేదీ లోక్ సభ ఎన్నికల ఫలితాలు వస్తాయి. అంత వరకూ ఇలాంటి జోస్యాలతో చర్చలు జరుగుతూనే ఉంటాయి. అంతవరకు నాయకులు, ప్రజలు వేచి చూడాల్సి ఉంటుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications