Summer Holidays: శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు..!
పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఛత్తీస్ గడ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ రాష్ట్రంలో తీవ్ర ఎండలను దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవులను పొడగించారు. అన్ని పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 25 వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు వర్తిస్తుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 22 నుంచి జూన్ 15 వరకు అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వేసవి సెలవులను జూన్ 25 వరకు పొడిగించింది. జూన్ 26 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ , రాజ్‌నంద్‌గావ్‌లలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాలులు కూడా వీస్తాయని పేర్కొంది.

దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించేందుకు సమయం పట్టడంతో చాలా చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో కూడా రుతుపవనాలు విస్తరించినా ఉక్కపోత ఆగడం లేదు.












Click it and Unblock the Notifications