దుస్తులు ఎవరు తొలగించారు?: సునందకు ఏం తెలుసో తెలియదని థరూర్

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. సునంద మృతి అనంతరం సంఘటన జరిగిన ప్రాంతంలో దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లుగా దర్యాఫ్తు బృందం గుర్తించింది.

సునందకు చెందిన పలు వస్తువులు అదృశ్యమైనట్లుగా గుర్తించారు. తద్వారా హత్యను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. సునందకు చెందిన షూస్, దుస్తులు సంఘటన స్థలం నుండి తొలగించారు. హత్య జరిగిందనేందుకు పలు ఆధారాలు ప్రత్యేక దర్యాఫ్తు బృందం గుర్తించిందని తెలుస్తోంది.

ఇది ఆత్మహత్య అయితే, అందుకు సంబంధించిన వస్తువులను సంఘటన స్థలం నుండి తొలగించి ఉండరు కదా అని అనుమానిస్తున్నారు. సునంద మృతికి ముందు, ఆ తర్వాత పలువురు హోటల్ రూంకి వచ్చారు. అంతేకాదు, ఆ గదిలో ఓ గ్లాసు పగిలిపోయి ఉంది. ఆమె దుస్తులు, చెప్పులు కూడా మిస్ అయ్యాయి.

Sundanda murdered- Who moved her clothes out of the room?

గ్లాస్ పగిలి పోవడం అనుమానాలకు తావిస్తోంది. అక్కడ ఏమైనా గొడవ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అలాకాకుండా సునంద మృతిని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా హడావుడిలో అది పగిలి ఉంటుందా అనే దానిపై విచారిస్తున్నారు. వీటన్నింటిని చూస్తుంటే సునంద మృతి సమయంలో గొడవకు ఆస్కారం ఉండి ఉంటుందంటున్నారు.

ఐపీఎల్ కోణంలో...

దర్యాఫ్తు బృందం ఐపీఎల్ కోణంలో కూడా విచారణ జరుపుతోంది. ఇందుకు సంబంధించిన అంశాల పైన ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో పలువురు.. ఐపీఎల్ అంశం సునందను పూర్తిగా మార్చేశాయని చెప్పారని తెలుస్తోంది.

తాను ఎప్పుడు ఏ కారణం లేకుండానే వార్తల్లో ఉంటున్నానని, వాటిలో తాను ఒక్క దానిని కూడా ఆస్వాదించలేకపోతున్నానని సునంద పుష్కర్ తన కుటుంబ సభ్యులకు చెప్పారట!

అదే సమంయలో విచారణలో పలువురు ఎన్నో విషయాలు దర్యాఫ్తు అధికారులకు చెప్పారు. ఐపీఎల్ విషయమై ఆమెకు చాలా విషయాలు తెలుసునని, ఆ విషయాల గురించి ఆమె మాట్లాడాలనుకున్నారని విచారణలో తెలిపారు. అయితే, సునంద చెబుతామనుకున్న ఆ విషయాల గురించి శశిథరూర్‌కు తెలుసా లేదా అనేది తెలియాల్సి ఉంది.

సునంద చెబుతామనుకున్న విషయాల గురించి మీకు తెలుసా అని దర్యాఫ్తు బృందం రెండు రోజుల క్రితం నాటి విచారణలో ప్రశ్నించినప్పుడు తనకు వాటి గురించి తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది.

సునంద ఏం చెప్పాలనుకున్నారో, దాని గురించి తనకు ఏం తెలియదని ఢిల్లీ పోలీసుల విచారణలో శశిథరూర్ చెప్పారని తెలుస్తోంది. అయితే, సునంద చెప్పాలనుకున్న విషయం తనకు నమ్మదగిన వ్యక్తులతో పంచుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+