వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో సూపర్ ఎమర్జెన్సీ : మోడీ కన్నా ఇందిరే నయం ...?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ కన్నా నరేంద్ర మోడీ పాలనలో దుర్మార్గం కొనసాగుతుందని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నీరుగార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా చేస్తోందని .. వారిపై ఆజమాయిషీ చేయడమే వారి అరాచకానికి పరాకష్ట అని విమర్శించారు.

ఇందిరే మిన్న ...
దేశంలో తొలిసారి అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. 1975 జూన్ 25 విధించిన ఎమర్జెన్సీ .. 1977 మార్చి 21 వరకు కొనసాగింది. ఈ సమయంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నీరుగారిన సంగతి తెలిసిందే. అయితే 2014లో నరేంద్ర మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో సూపర్ ఎమర్జెన్సీ కొనసాగుతుందని మమతా విమర్శించారు.

‘Super emergency for last 5 years’: Mamata

ఇది వారి నియంతృత్వానికి ఉదహరణ అని పేర్కొన్నారు. ఆనాడు ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారో .. ఇప్పుడు మోడీ సూపర్ ఎమర్జెన్సీ కూడా కొనసాగుతుందని గుర్తుచేశారు. ఆనాటి రోజులు ఎలా ఉండేవో గత ఐదేళ్లుగా దేశంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయని పేర్కొన్నారు. మోడీ-షా ద్వయం చేసిన అరాచకాలు మన కళ్ల ముందు కదలాడుతున్నాయని చెప్పారు. ఆ గుణపాఠాలతో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నింటీని నీరుగారుస్తున్నారని మండిపడ్డారు.

ఢీ అంటే ఢీ
గత కొద్దికాలంగా మోడీ వర్సెస్ మమతా మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మోడీ-షా ద్వయం బెంగాల్‌లో బీజేపీ అధికారం చేపట్టేందుకు రోడ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇటీవల మెజార్టీ ఎంపీ సీట్లు గెలువడం .. వారికి మరింత బూస్ట్ నిచ్చిట్టైంది. దీంతో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అయితే దీదీ కూడా వారికి ధీటుగా స్పందిస్తున్నారు. దీంతో టీఎంసీ నేతలను ప్రలోభాలకు గురిచేసి .. బీజేపీలో చేర్చుకుంటున్నారు.

English summary
hitting out at the BJP, West Bengal chief minister Mamata Banerjee said while Tuesday was the anniversary of the Emergency imposed in 1975, the country is going through “super emergency” for the past five years. Emergency was imposed by then Prime Minister Indira Gandhi on this day in 1975 which was in effect till March 21, 1977. “Today is the anniversary of the Emergency declared in 1975. For the last five years, the country went through a ‘Super Emergency’. We must learn our lessons from history and fight to safeguard the democratic institutions in the country,” Banerjee tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X