super cm: ప్రభుత్వ ఉద్యోగుల నిరవదిక సమ్మెకు గంటల్లోనే చెక్ పెట్టిన సీఎం, తెగేవరకు లాగే సీఎం కాదు !
ఇక్కడ ఓ సీఎం ప్రభుత్వ ఉద్యోగుల నిరవదిక సమ్మె మొదలు పెట్టిన కొన్ని గంటల్లోనే వారి కోరికలు తీర్చి ప్రతిపక్షాలు విమర్శలు చెయ్యకుండా షాక్ మీద షాక్ ఇచ్చారు.
బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లు పరిష్కరించాలని మొదట ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు. చర్చలు విఫలం అయితే సమ్మెకు డెడ్ లైన్ పెడతారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ చేసి సమ్మెకు దిగుతారు. ఆ చర్చలు. ఈ చర్చలు అంటూ ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజలను తికమకపెడుతారు. ఇలా కొంతకాలం పాటు ప్రతిపక్షాలను దారి మళ్లించిన తరువాత చివరికి ఏదో ఒకరకంగా ప్రభుత్వ ఉద్యోగులను లొంగదీసుకుంటారు. అయితే ఇక్కడ ఓ సీఎం ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె మొదలు పెట్టిన కొన్ని గంటల్లోనే వారి కోరికలు తీర్చి ప్రతిపక్షాలు విమర్శలు చెయ్యకుండా షాక్ మీద షాక్ ఇచ్చారు. ఎవరు ఆ సీఎం, ఏమిటా ఆ కథ ?.

ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్
కర్ణాటకలో కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ప్రభుత్వంతో ప్రభుత్వ ఉద్యోగుల చర్చలు విఫలం అయ్యాయి. మా కోరికలు తీర్చకపోతే మేము నిరవదిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వ ఉద్యోగులుు డెడ్ లైన్ పెట్టారు. అయినా ప్రభుత్వం వేచి చూసింది. అయితే ?

గుడ్ న్యూస్ చెప్పిన సీఎం
ఏడో వేతన సంఘం అమలు చేయాలని, కొత్త పెన్షన్ విధానాన్ని (ఎన్‌పీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బుధవారం ఉదయం నిరవదిక సమ్మె చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరవదిక సమ్మె రెండు మూడు గంటల్లోనే విరమించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17% వేతన పెంపునకు అంగీకరిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు తమ నిరవధిక సమ్మెను మూడు గంటల్లోనే విరమించారు.

డేట్ కూడా ఫిక్స్ చేసిన సీఎం
17% వేతన పెంపు ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2023 నుండి అమలులోకి వస్తాయని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వ నిర్ణయంతో కర్ణాటకలోని ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ వచ్చింది. కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల నిరసనకు తెరపడింది. దీనిపై మీడియాతో మాట్లాడిన కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షడక్షరి తాము సమ్మె విరమిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయంతో మాకు సంతృప్తి లేదని, మేము 25% కోరామని, ప్రభుత్వం 17% ఇస్తామని తొలిదశలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము ఆమోదించామని పండక్షరి వివరించారు.

సీఎంకు, ప్రభుత్వానికి థ్యాక్స్
ప్రభుత్వం మా కోసం రెండు ఉత్తర్వులు జారీ చేసింది. మేము కర్ణాటక ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని పండక్షరి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు షడక్షరి అన్నారు. మా డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా అంగీకరించినందున రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారని, ఇప్పుడే సమ్మె విరమిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ వెంటనే కార్యాలయానికి హాజరుకావాలని పండక్షరి ఉద్యోగులకు సూచించారు.

సూపర్ సీఎం బోమ్మయ్
ఆదివారం ఉదయం నుంచి ప్రభుత్వ డిమాండ్‌పై ప్రభుత్వం చర్చించింది. 7వ వేతన సంఘం మధ్యంతర నివేదిక అమలు చెయ్యడానికి ప్రభుత్వం 30 రోజుల సమయం కోరింది. గతంలో మధ్యంతర ఉపశమనం కల్పించారు. అందుకు తగ్గట్టుగానే ఈసారి కూడా పరిహారం అలవెన్స్ ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. తాత్కాలిక భృతి ఇవ్వాలని కూడా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

తెగే వరకు లాగితే ఏం ప్రయోజనం ?
ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె డిమాండ్ చేసిన కొన్ని గంటల్లోనే వారి సమ్మెను సీఎం బసవరాజ్ బోమ్మయ్ వారి సమస్యలను పరిష్కరించారు. కొంత మంది సీఎంలు లాగిలాగి తెగిపోయే వరకు చెయ్యకుండా బసవరాజ్ బోమ్మయ్ సరైన నిర్ణయం తీసుకున్నారని కన్నడిగులు అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు నిరవదిక సమ్మెకు పిలుపు ఇవ్వడంతో ఇక్కడ ఏం జరుగుతుందో వేచి చూడాలి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications