వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రమైన కిడ్నీ సమస్య: మామూలు పిల్లాడిలా మారడానికి 9ఏళ్ల సాయిప్రకాశ్‌కి సాయం చేయండి

Google Oneindia TeluguNews

ఎల్లప్పుడూ హుషారుగా సంతోషంగా, అరుపులు, కేరింతలతో సరదాగా చుట్టుపక్కల స్నేహితులతో ఆటలాడుతూ గడపాల్సిన ఆ బాబు బాల్యం ఆసుపత్రి మంచానికి పరిమితమైపోయింది. ఆ బాబు పేరు సాయి ప్రకాష్. 9ఏళ్ల పిల్లాడు. మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతున్నాడు. అతని వ్యధ వర్ణనాతీతం. అతని తల్లి దుర్గాదేవి చెప్పిన కథనం ప్రకారం, " మా జీవితాలు, ఒకే రోజున కొన్ని సెకండ్ల వ్యవధిలోనే తారుమారై పోయాయి. తీవ్రమైన అనారోగ్యంతో నా బిడ్డ నాలుగేళ్ల సాయి ప్రకాష్, కుప్పకూలిపోయాడు". వెంటనే ఆసుపత్రికి తరలించాం, వైద్యులు నా బిడ్డకి మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లుగా నిర్ధారించారు.

అప్పటి నుంచి సాయి తల్లిదండ్రులకు రొటీన్ చెకప్స్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగడం ఔషధాల కోసం వేలకు వేలు ఖర్చవడం పరిపాటి అయింది. "గతంలో, ఇంజక్షన్ చూస్తేనే నానా హంగామా చేసే వాడు, ఇప్పుడు మీ ఇష్టం అన్నట్లు శరీరాన్ని అప్పగిస్తున్నాడు అంటే, ఎంత హృదయ విదారకమైన పరిస్థితిలో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. కనీసం చిన్న అరుపు కూడా రావడంలేదు నోటి నుంచి.

సాయిప్రకాశ్‌ కు సహాయం చేయాలనుకునే వారు ఇక్కడ క్లిక్ చేస్తే బ్యాంక్ డిటేల్స్ వస్తాయి.

 Support Sai Prakash’s Fight Against Kidney Failure

ఒకరోజు సాయి సమయానికన్నా ముందుగానే పాఠశాల నుంచి తిరిగి వచ్చాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. శ్వాస సరిగ్గా తీసుకో లేక అల్లాడిపోయాడు. చాలా బలహీనంగా మారాడు. కనీసం అడుగులు వేయలేని స్థితికి చేరుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. మా బాబు సాయి ప్రకాశ్ మూత్రపిండం విఫలమైందని తెలిసింది.

"మూత్రపిండ మార్పిడి మాత్రమే ఇందుకు పరిష్కారం అని వైద్యులు తేల్చిచెప్పారు" . శస్త్రచికిత్సకు సుమారుగా రూ. 15 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. మాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాం. " అంటూ సాయి తల్లి కన్నీరు పెట్టుకుంది. ఆమె ఒక సాధారణ గృహిణి. ఆమె భర్త జైప్రకాష్ స్థానిక ఏజెన్సీలో ఒక కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. ఆయన వేతనం నెలకు రూ. పదివేలు.

 Support Sai Prakash’s Fight Against Kidney Failure

"మా చేతిలో డబ్బుల్లేక, కనీసం ఆసుపత్రిలో అడ్మిట్ కూడా చేయలేకపోయాం. ఇప్పటికే 5 లక్షల రూపాయల వరకు అప్పులు తెచ్చాం. మా బిడ్డ ప్రాణాల్ని నిలబెట్టుకోవడం కోసం అష్టకష్టాలుపడుతున్నాం.. కానీ అన్నీ దిక్కులు మూసుకుని పోయాయి" అంటూ బోరున విలపించింది సాయి తల్లి దుర్గా దేవి.

" మంచానికే అంకితమైపోయి ఉన్నప్పటికీ, తల్లిదండ్రులకు ఏవిధంగానైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అంత మంచి పిల్లవానికి ఈ మహమ్మారి రోగం వచ్చిందని తలచుకుంటేనే బాధేస్తుంది. నేను నా భర్త ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు, తన తమ్ముడి బాధ్యతను మా బదులుగా తనే నిర్వర్తిస్తాడు.

మా బాబుకు తన అనారోగ్య పరిస్థితి గురించి అంతగా తెలియదు. తను పడుతున్న బాధ ఎంత తీవ్రమైనదో కూడా అర్థం చేసుకోలేని స్థితి నా బిడ్డది. త్వరలోనే తాను పరీక్షలకు సిద్ధమవుతానని అంటూ ఉంటాడు. స్కూలుకి వెళ్లడానికి ఆసక్తిని కనపరుస్తుంటాడు.. తన పరీక్షలకు హాజరు కాలేకపోవడం తనను ఎంతగానో కలచివేసింది. కానీ తన ఆరోగ్యం ఎంతో ప్రాముఖ్యమని అర్థం చేసుకునే వయస్సు కూడా కాదు తనది. " అంటూ తన కొడుకు బాధను చెప్పింది తల్లి దుర్గా దేవి.

సాయి తల్లిదండ్రులు వారి కుమారుడి మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చు రూ. 15 లక్షల కోసం విరాళాలు సేకరిస్తున్నారు. మీ వంతుగా మీరు సాయం చేయండి.

మానవత్వం ఇంకా మనుగడలో ఉందని తెలిసేలా అందరూ చేతులు కలపండి.
మీ చిన్న సహాయం కూడా సాయి జీవితంలో మంచి మార్పునకు సహకారం అందివ్వగలదు. చిన్న చిన్న నీటి బొట్లే, పెద్ద నదిగా మారుతాయి. నిధుల సేకరణదారునికి విరాళం ఇవ్వడం ద్వారా, మీ కుటుంబం, స్నేహితులకు వారి వ్యధను భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి సహాయం చేసినవారవుతారు. మీ నుంచి వచ్చే చిన్న విరాళమైనా సాయి తల్లిదండ్రులకు ఎంతగానో సహాయం చేస్తుందని మరచిపోకండి.

Read in English: 9-Year-Old Sai’s Battle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X