సుప్రీం సంచలనం: రేప్ బాధితురాలి అబార్షన్‌కు అనుమతి
న్యూఢిల్లీ: ముంబైకి చెందిన అత్యాచార బాధితురాలు తన 24 వారాల ప్రగ్నెన్సీని అబార్షన్‌తో తొలగించుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం అనుమతి ఇచ్చింది. బాధితురాలి మెడికల్ రిపోర్టల ప్రకారం శిశువు ఎదుగుదల సరిగా లేకపోవడం ఒక కారణం కాగా, శిశువు పెరుగుదల వల్ల తల్లి ప్రాణాలకు ప్రాణాపాయం ఉండడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
వివరాల్లోకి వెళితే... తన మాజీ ప్రియుడి చేతిలో అత్యాచారానికి గురైన ముంబైకి చెందిన మహిళ గర్భం దాల్చింది. అయితే ఆ మహిళకు అబార్షన్ చేసేందుకు వైద్యులు నిరాకరించడంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. భారత చట్ట ప్రకారం 20 వారాలు దాటిన గర్భాన్ని తొలగించకూడదన్న నిబంధన ఉండడంతో ముంబై వైద్యులు ఆమెకు ఆబార్షన్ చేసేందుకు నిరాకరించారు.

రేప్ బాధితురాలి అబార్షన్‌కి సుప్రీం గ్రీన్ సిగ్నల్
ముంబైకి చెందిన అత్యాచార బాధితురాలు తన 24 వారాల ప్రగ్నెన్సీని అబార్షన్‌తో తొలగించుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం అనుమతి ఇచ్చింది.

రేప్ బాధితురాలి అబార్షన్‌కి సుప్రీం గ్రీన్ సిగ్నల్
జస్టిస్ జగ్దీష్ సింగ్ ఖేహర్, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య బెంచ్ తల్లి ప్రాణాలకు ప్రాణపాయం ఉన్న నేపథ్యంలో గర్బం తొలగించవచ్చని సోమవారం తీర్పు వెలువరించింది.

రేప్ బాధితురాలి అబార్షన్‌కి సుప్రీం గ్రీన్ సిగ్నల్
శుక్రవారం సుప్రీంకోర్టు మహిళ ఆరోగ్య పరిస్థితి గురించి సవివరంగా తెలియజేయాలని ముంబైలోని కేఈఎం ఆస్పత్రిని ఆదేశించింది. తీర్పు నేపథ్యంలో ఏడుగురు వైద్యులతో కూడిన బృందం ఆమెకు శుక్రవారం నాడు వైద్య పరీక్షలు నిర్వహించి సుప్రీం కోర్టుకు నివేదికను అందజేయనున్నారు.

రేప్ బాధితురాలి అబార్షన్‌కి సుప్రీం గ్రీన్ సిగ్నల్
ఇదిలా ఉంటే మెడికల్ బోర్డ్ కూడా గర్భస్థ శిశువుకు అవయవాల పెరుగుదల సరిగా లేదని, గర్భాన్ని అలాగే ఉంచితే తల్లి ప్రాణాలకు ప్రమాదం ఉందని నివేదిక ఇచ్చింది. వీటి ఆధారంగా నేడు సుప్రీంకోర్టు గర్భం 20 వారాలు దాటినప్పటికీ అబార్షన్ చేయొచ్చని తీర్పును వెల్లడించింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications