శాండిల్ వుడ్ సూపర్ స్టార్‌కు బిగ్ షాక్..!!
Challenging Star Darshan: ప్రముఖ కన్నడ నటుడు, శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీపకు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు లభించిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీనిపై గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. న్యాయస్థానం ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
రేణుక స్వామి హత్యకేసులో దర్శన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో గత ఏడాది ఆయన తొలుత అరోగ్య కారణాలతో బెయిల్ పొందారు. అనంతరం డిసెంబర్ 13వ తేదీన కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అలాగే- ఇదే కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ నటి పవిత్ర గౌడ, మరో 15 మంది నిందితులకూ షరతులతో కూడిన బెయిల్ లభించింది అప్పట్లో.

దీన్ని సవాల్ చేస్తూ పోలీసులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదోపవాదాలను ఆలకించింది. తాజాగా తుది తీర్పు వెలువడించింది. దర్శన్ బెయిల్ ను కొట్టివేసింది.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్.. ప్రధాన నిందితుడు. కన్నడ నటి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీలకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తుండేవాడనే కారణంతో రేణుకా స్వామిపై కక్ష పెంచుకుని సుపారీ ఇచ్చి అతణ్ని హత్య చేయించాడనే ఆరోపణలపై గత ఏడాది జూన్ 11వ తేదీన అరెస్ట్ అయ్యారు.
దర్శన్, పవిత్ర గౌడ, మరో 15 మంది పేర్లపై పోలీసులు ఛార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 3,991 పేజీల ఛార్జ్‌షీట్ ఇది. ఇందులో ఏ1గా పవిత్ర గౌడ, ఏ2గా దర్శన్ పేర్లను నమోదు చేశారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం ఈ ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు అందజేసింది.
ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలు కూడా ఇందులో ఉన్నాయి. బెంగళూరులోని 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దీనిపై విచారణ చేపట్టింది. రేణుక స్వామి కిడ్నాప్, హత్యకేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మంది సాక్షులను విచారించినట్లు ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు.
అలాగే- 50 మందికి పైగా పోలీసులు, ఎనిమిది మంది డాక్టర్లు, 97 మంది ఇతర సాక్షుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. సెక్షన్ 164 సీఆర్పీసీ కింద 27 మంది తమ వాంగ్మూలాలను కోర్టు ముందు నమోదు చేసుకున్నట్లు వివరించారు.
రేణుక స్వామి హత్యకు కుట్ర పన్నడం, దాన్ని అమలు పరచడం, కిడ్నాప్, చిత్రహింసలు పెట్టడం, హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, తామే హత్య చేసినట్లుగా నలుగురిని పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రరేపించడం, దీని ద్వారా కేసు దర్యాప్తు, పోలీసులను తప్పుదోవ పట్టించేలా ప్లాన్ చేయడంలో దర్శన్, పవిత్ర గౌడ పాత్ర ఉందని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications