ఎయిర్ ఇండియా ప్లైట్ క్రాష్ కు పైలటే కారణమా ? తేల్చేసిన సుప్రీంకోర్టు..!
ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం ఐదు నిమిషాల్లోనే కుప్పకూలిన ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఈ ప్రమాదానికి గల కారణాలపై ఎన్నో చర్చలు జరిగాయి. భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో విచారణలో ఈ ప్రమాదానికి పైలట్ కారణమని ప్రాథమికంగా తేల్చారు. దీంతో పైలట్లపై విమర్శలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో పైలట్ల సంఘంతో పాటు ఈ విమానం నడిపి ప్రాణాలు కోల్పోయిన పైలట్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన కుమారుడి వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో ఎలా చెబుతుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై తగు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో పుష్కరాజ్ సభర్వాల్ పిటిషన్ తో పాటు పైలట్ల సంఘం పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇవాళ కేంద్రం, డీజీసీఏకు నోటీసులు ఇచ్చింది.

అదే సమయంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడానికి పైలటే కారణమన్న వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని, కానీ మీ కొడుకును నిందిస్తున్న ఈ భారాన్ని మీరు మోయకూడదని వ్యాఖ్యానించింది. అలాగే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పైలట్ సుమీత్ సభర్వాల్ ను ఎవరూ తప్పుబట్టకూడదని కూడా వెల్లడించింది.

ఈ ప్రమాదంపై జూలైలో విడుదల చేసిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ప్రాథమిక నివేదికలో రెండు ఇంజిన్‌లకు ఇంధన సరఫరా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నిలిచిపోయినట్లు గుర్తించింది. దీనికి కారణం పైలట్లే అన్న అర్ధం వచ్చేలా ఈ నివేదిక ఉంది. విమానంలో రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లను వెంటవెంటనే కటాఫ్ చేశారని తెలిపింది.
దాదాపు 10 సెకన్ల తర్వాత స్విచ్‌లను తిరిగి ఆన్ చేసినప్పటికీ, ఇంజిన్లు అప్పటికే మంటలు చెలరేగి, క్రాష్‌కు దారితీశాయని నివేదిక పేర్కొంది. దీంతో వివాదం చెలరేగింది. అప్పటి నుంచి తాను మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు పైలట్ తండ్రి సుప్రీంకోర్టుకు తెలిపారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications