వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరణశిక్షతో సమానం, మనదేశంలోనే ఎందుకు?: ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు

ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేగాక, ట్రిపుల్ తలాఖ్ ఇవ్వడం మరణశిక్షతో సమానమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రిపుల్ తలాఖ్ ఇవ్వడం మరణశిక్షతో సమానమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రిపుల్ తలాఖ్ ఒక్క మనదేశంలోనే ఎందుకుందంటూ నిలదీసింది. దీనికి స్పందించిన సల్మాన్ ఖుర్షీద్.. ఇండియాలో తప్ప మరెక్కడా ట్రిపుల్ తలాఖ్ అమలులో లేదని చెప్పారు.

ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది రామ్‌ జఠ్మలాని మాట్లాడుతూ.. తలాఖ్ చెప్పేందుకు ముస్లిం పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు లేవని తన వాదనలు వినిపించారు. ఇరు వర్గాల మధ్య వాదనలు కొనసాగుతున్నాయి.

Supreme Court compares triple talaq to death penalty

ఇటీవల అత్యంత చర్చనీయాంశంగా మారిన ట్రిపుల్ తలాఖ్(తలాఖ్ తలాఖ్ తలాఖ్) పద్ధతి రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టులో గురువారం చారిత్రక విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆరు రోజుల పాటు ఈ విచారణ కొనసాగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహార్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది.

తలాక్‌ అనేది మతపరమైన ముఖ్య ఆచారమా.. ప్రాథమిక హక్కా అనే అంశంపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. ఇస్లాం ప్రకారం.. భార్య నుంచి విడాకులు తీసుకోవాలంటే మూడు సార్లు తలాఖ్ చెబితే సరిపోతుంది. అయితే అనాదిగా వస్తున్న ఈ పద్ధతిని అవకాశంగా తీసుకుని, ఇటీవల కొందరు కారణం లేకుండానే భార్యను వదిలేస్తున్నారు.

వాట్సాప్‌, పోస్టుకార్డు, పేపర్‌ ప్రకటనల ద్వారా ముమ్మారు తలాక్‌ చెప్పి.. విడాకులిస్తున్నారు. దీంతో బాధిత మహిళల పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కొందరు ముస్లిం మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు
ముస్లింలలో వివాహాన్ని రద్దు చేసుకునే ఈ ట్రిపుల్‌ తలాఖ్‌ విధానం 'అనుచితం, అవాంఛనీయం' అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేవుడు అన్యాయాన్ని సమర్థిస్తాడని చెబుతారా? అని నిలదీసింది.

English summary
In a very strong observation, the Supreme Court has said that triple talaq is the worst and most undesirable form of ending a marriage among Muslims. The observations were made during a hearing on a batch of petitions challenging the constitutional validity of triple talaq. Chief Justice of India, J S Khehar who is heading the Bench also went on to compare triple talaq to death penalty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X