satyendar jain: సత్యేందర్ జైన్‍కు బెయిలిచ్చిన సుప్రీం కోర్టు..
ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సత్యేందర్ జైన్ ఆరోగ్య స్థితిని ముందుగా వైద్యుల బృందం పరిశీలించాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదనను తోసిపుచ్చిన దేశ ఉన్నత న్యాయస్థానం జైన్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సత్యేంద్ర జైన్ ఏడాదిన్నరగా జైలులోనే ఉన్నారు.
జైన్ తీహార్ జైలులో బాత్రూంలో పడిపోవడంతో చికిత్స కోసం ఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్ (LNH)లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేరారు. సత్యేందర్ జైన్ కు ఆరు వారాల పాటు జైన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ, న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యపరమైన కారణాలతోని మాత్రమే కోర్టు అతనికి ఉపశమనం ఇస్తోందని, తదుపరి ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకునేందుకు జూలై 10న అతని తాజా వైద్య నివేదికలను పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

"ఆయన ఆరోగ్య మంత్రి. ఆయన జైలు మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి, అతనికి జైల్లో వైద్యులు, అధికారులు తెలుసు. ఈ నివేదికలన్నీ మోసపూరితంగా ఉండవచ్చ. వాటిపై ఆధారపడలేము. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో లేని ఎయిమ్స్ లేదా మరో ఆసుపత్రి వైద్యుల బృందం అతడిని పరీక్షించాలని" అని ఈడీ తరఫు న్యాయవాది రాజు వాదించారు.
జైన్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. తన క్లయింట్ మెడికల్ రిపోర్టులు అతనికి తక్షణ వైద్య సహాయం అవసరమని ధృవీకరించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. "తీహార్ జైలులో జైన్ గాయపడిన తర్వాత లోక్ నాయక్ తప్పనిసరి రిఫరల్ ఆసుపత్రి తీసుకెళ్లారు. వైద్య నివేదికలు అబద్ధం కావు . మానవతా ప్రాతిపదికన ఆయన దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి" అని వాదించారు. జైన్ 33 కిలోల బరువు తగ్గాడు. అతను వెన్నుపూస శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉందన్నారు.
దీనికి రాజు బదులిస్తూ జైన్ భోజనం చేయకపోవడంతో బరువు తగ్గాడని చెప్పారు. AIIMSలోని వైద్యుల బృందం జైన్‌కు వైద్య పరీక్షలు చేయించాలని ASG రాజు బెంచ్‌ను అభ్యర్థించారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ తదుపరి తేదీన అతను సమర్పించే నివేదికలను పరిశీలించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నవంబర్‌లో ట్రయల్ కోర్టు, ఏప్రిల్ 6న ఢిల్లీ హైకోర్టు బెయిల్ జైన్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో
సుప్రీంకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications