ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం..!!
సిసోడియాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం మంజూరు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో 17 నెలల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని సిసోడియాను సుప్రీం ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం తీర్పును రిజర్వ్ చేసి నేడు వెలువరించింది.
సిసోడియాకు బెయిల్
సుప్రీంకోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువడింది. సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. 17 నెలల తర్వాత మనీష్ సిసోడియా బయటకు రానున్నారు. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సిసోడియాకు బెయిల్ సుప్రీం బెయిల్ ఇచ్చింది. ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు విచారణలో పురోగతి లేకపోతే... ఒక పరిమితి దాటిన తర్వాత జైలులో ఉంచలేరని పేర్కొంది. అలా కాదు అని... జైలులో ఉంచాలి అనుకుంటే ఆ వ్యక్తి హక్కులు హరించడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది.

కోర్టు కీలక వ్యాఖ్యలు
కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం విధానం కేసులో బెయిల్ లభించింది. సుదీర్ఘ కాలం జైలులో ఉంచాలి అనుకుంటే ఆ వ్యక్తి హక్కులు హరించడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. బెయిల్‌కి అప్లికేషన్ పెట్టుకోవడం, బెయిల్ పొందడం వారి హక్కు అని ధర్మాసనం పేర్కొంది. సిసోదియాకు బెయిల్ ఇవ్వొద్దు అని దర్యాప్తు సంస్థలు చేసిన వాదనలు అన్నింటినీ ధర్మాసనం తోసిపుచ్చింది. విచారణ ఆలస్యం కావడానికి సిసోడియా కూడా కారణమన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సైతం పక్కనబెట్టింది.
షరతులు వర్తిస్తాయి
బెయిల్ అనేది నియమమని.. జైలు మినహాయింపు అని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ట్రయల్ వేగంగా జరిగేందుకు సిసోడియా సహరించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సిసోడియా బెయిల్‌ను ఈడీ, సీబీఐ వ్యతిరేకించాయి. తనపై ఉన్న కేసుల్లో ఎలాంటి పురోగతి లేదని కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును సిసోడియా కోరారు. దీంతో, సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని కోర్టు సూచించింది. పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications