వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా సంక్షోభం వేళ .. నిశ్శబ్దంగా ప్రేక్షక పాత్ర పోషించలేమని సుప్రీం కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి కారణంగా భారతదేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రేక్షక పాత్ర పోషించలేమని భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.కరోనా మహమ్మారి కారణంగా ఆయా రాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితులను హైకోర్టులలో విచారణ జరుపుతూ మెరుగైన స్థితిలో పర్యవేక్షిస్తున్నప్పటికీ ఈ సంక్షోభ సమయంలో తాము స్పందించకుండా ఉండలేమని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. హైకోర్టులు వివిధ రాష్ట్రాల్లో పిటిషన్లను విచారించడాన్ని ఆపాలని తాము భావించడం లేదని సుప్రీంకోర్టు ఈ రోజు మరోసారి స్పష్టం చేసింది.

రాజు గారు మీరు మరీనూ , జగన్ కరోనా మీద దృష్టి పెట్టాలా.. బెయిల్ రద్దు ఆపుకోవాలా ? కింకర్తవ్యం ? :వర్ల సెటైర్లురాజు గారు మీరు మరీనూ , జగన్ కరోనా మీద దృష్టి పెట్టాలా.. బెయిల్ రద్దు ఆపుకోవాలా ? కింకర్తవ్యం ? :వర్ల సెటైర్లు

జాతీయ సంక్షోభ సమయంలో, సుప్రీంకోర్టు నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండకూడదు

జాతీయ సంక్షోభ సమయంలో, సుప్రీంకోర్టు నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండకూడదు

సుప్రీంకోర్టు పరిష్కరించాల్సిన కొన్ని జాతీయ సమస్యలు ఉన్నాయి. జాతీయ సంక్షోభ సమయంలో, సుప్రీంకోర్టు నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండకూడదు" అని సుప్రీంకోర్టు తెలిపింది. మేము హైకోర్టులను కరోనా పరిస్థితిపై విచారణ చేయకుండా నిరోధించమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం రాష్ట్రాల మధ్య జరుగుతున్న సహకారాలను సమన్వయ పరచడంలో తమ పాత్ర ఉంటుందని ,కరోనా మహమ్మారి కారణంగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలను సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్న సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.

 హై కోర్టులలో ఉన్న కేసుల విచారణకు సహకరిస్తామని చెప్పిన సుప్రీం

హై కోర్టులలో ఉన్న కేసుల విచారణకు సహకరిస్తామని చెప్పిన సుప్రీం

ప్రాదేశిక పరిమితుల కారణంగా సమస్యలను పరిష్కరించడంలో హైకోర్టులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే, మేము సహాయం చేస్తామని జస్టిస్ డివై చంద్రచూడ్ తో పాటు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఉన్న ఎల్ఎన్ రావు మరియు రవీంద్ర ఎస్ భట్ పేర్కొన్నారు. పెరుగుతున్న కోవిడ్ కేసుల మధ్య దేశవ్యాప్తంగా ఆక్సిజన్, వ్యాక్సిన్లు, మందుల పంపిణీకి సంబంధించిన సమస్యలపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు గత వారం నిర్ణయించి కేంద్రానికి నోటీసు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా ఆరు హైకోర్టులలో విచారణ .. అయినా కోవిడ్ పై సుమోటోగా సుప్రీం విచారణ

దేశవ్యాప్తంగా ఆరు హైకోర్టులలో విచారణ .. అయినా కోవిడ్ పై సుమోటోగా సుప్రీం విచారణ


జాతీయ ప్రణాళికకోసం పిలుపునిస్తూ, దేశవ్యాప్తంగా ఆరు హైకోర్టులు సంబంధిత పిటిషన్లను విచారిస్తున్నాయి. కానీ కరోనా మహమ్మారి విషయంలో గందరగోళం మరియు వనరుల మళ్లింపు ఉందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దేశంలో కరోనా నియంత్రణ చర్యలపై సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గత వారమే ఈ విచారణను ప్రారంభించింది.అప్పటి చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణలో భాగంగా కరోనా విలయాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికను కోర్టు ముందుంచాలని ఆదేశించింది.

జాతీయ ప్రణాళికను సుప్రీం ధర్మాసనానికి సమర్పించిన కేంద్రం

జాతీయ ప్రణాళికను సుప్రీం ధర్మాసనానికి సమర్పించిన కేంద్రం


కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ ప్రణాళికను తాజాగా సుప్రీంకోర్టుకు నివేదించిన తర్వాత, పలు ప్రశ్నలను కేంద్రానికి సంధించింది సుప్రీం ధర్మాసనం విచారణ సందర్భంగా, ఆక్సిజన్ సరఫరా, రాష్ట్రాల అంచనా అవసరం, రాష్ట్రాల అవసరాలపై అనుసరించిన పద్దతి, పడకలతో సహా క్లిష్టమైన వైద్య అవసరాల పెంపు, అవసరమైన మందుల లభ్యతను నిర్ధారించే చర్యలు గురించి సమాచారాన్ని సమగ్రంగా అందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు అఫిడవిట్ దాఖలు చెయ్యాలని సుప్రీం ఆదేశం

పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు అఫిడవిట్ దాఖలు చెయ్యాలని సుప్రీం ఆదేశం

రెమిడెసివిర్ మరియు ఫావిపిరవిర్లతో సహా, టీకా అవసరం మరియు టీకా ధరలపై తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని వీటిపై గురువారం సాయంత్రం నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. ఈ కేసు విచారణకు అమికస్ క్యూరీ లుగా సీనియర్ న్యాయవాదులు జై దీప్ గుప్తా, మీనాక్షి అరోరాలను సుప్రీం ధర్మాసనం నియమించింది.

English summary
The Supreme Court today again clarified that while taking up the shortage of oxygen, medicines, vaccines and other supplies in the Covid crisis, it did not intend to stop High Courts from hearing petitions in various states. The court said it intended to play a complimentary role and could not be a silent spectator at this time. "There are certain national issues to be dealt by the Supreme Court. At a time of national crisis, Supreme Court cannot be silent spectator," the Supreme Court said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X