సోషల్ మీడియాలో ఆ వీడియోలు, పోస్టులపై సుప్రీంకోర్టు నిషేధం..!

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు(Supreme Court) లో నిత్యం జరిగే కోర్టు విచారణల్ని ఎప్పుడైతే ప్రత్యక్ష ప్రసారం చేసే విధానం అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచీ న్యాయమూర్తుల, కోర్టు విచారణల వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో పెరిగాయి. వీటిని అడ్డంపెట్టుకుని మార్ఫింగ్ లు చేసి మరీ సంపాదించే వారు కూడా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా వీటిపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

CJP: రేపు దేశవ్యాప్తంగా..! కాక్రోచ్ జనతా పార్టీ సంచలన పిలుపు..!
CJP: రేపు దేశవ్యాప్తంగా..! కాక్రోచ్ జనతా పార్టీ సంచలన పిలుపు..!

దేశంలో సంబంధిత కోర్టు ముందస్తు అనుమతి లేకుండా కోర్టు కార్యకలాపాల ఆడియో-వీడియో రికార్డింగ్‌లను పోస్ట్ చేయడం లేదా అప్‌లోడ్ చేయడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఒక మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. దాని ప్రకారం సంబంధిత హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ లేదా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా న్యాయ కార్యకలాపాల ఆడియో/వీడియో రికార్డింగ్‌లను సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సేకరించడం, సవరించడం, వైరల్ చేయడం, పోస్ట్ చేయడం, రీ-పోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం లేదా వాటి ద్వారా డబ్బు సంపాదించడం వంటివి చేయడంపై నిషేధం విధించారు.

Supreme Court Restricts Sharing of Court Hearing Recordings on Social Media Without Permission
కాక్రోచ్ ల దెబ్బకు కేంద్రం ఉక్కిరిబిక్కిరి..! ఢిల్లీ హైకోర్టులో కీలక పరిణామాలు..!
కాక్రోచ్ ల దెబ్బకు కేంద్రం ఉక్కిరిబిక్కిరి..! ఢిల్లీ హైకోర్టులో కీలక పరిణామాలు..!

అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వు వార్తల పోస్టింగ్స్ విషయంలో మాత్రం ఎలాంటి ప్రభావం చూపదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో మీడియా సంస్థలకు కాస్త ఊరట దక్కినట్లయింది. అయితే మిగతా వాళ్లు మాత్రం కోర్టు కార్యకలాపాలను, విచారణలను ఇకపై పోస్టింగ్ చేసేటప్పుడు సంబంధిత హైకోర్టుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సుప్రీంకోర్టుకు ఈ విషయంలో చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+