ఏపీ సర్కార్‌కు చుక్కెదురు.. అమరరాజాపై చర్యలపై స్టే
సుప్రీంకోర్టులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యింది. అమరరాజా బ్యాటరీస్ సంస్థపై ఎలాంటి చర్యలకు దిగొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమరరాజా బ్యాటరీస్ కంపెనీకి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఫిబ్రవరిలో జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

సదరు నోటీసులపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమరరాజా బ్యాటరీస్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమకోహ్లీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. ఏపీ ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ప్రధాన విద్యుత్ పంపిణీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టంచేసింది.
సుప్రీంకోర్టు స్టే విధించడంతో అమరరాజా బ్యాటరీస్‌కు తాత్కాలికంగా ఊరట కలిగింది. ప్రభుత్వం నుంచి చర్యలకు బ్రేక్ పడినట్టయ్యింది. ఈ కంపెనీ టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ది అనే సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications