రాష్ట్ర విభజన సరైనదే- జంధ్యాల రవిశంకర్ వాదనలను కొట్టేసిన సుప్రీంకోర్టు
జమ్మూ కాశ్మీర్ విభజనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఆర్టికల్ 370ని రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ ను కొట్టేసింది.
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంట్ లో ఆమోదించిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ పిటీషన్లపై విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనని తెలిపింది.

మెజారిటీ అంశాలపై వ్యతిరేకతే..
పునర్విభజన అనంతరం జమ్మూ కాశ్మీర్, లఢక్‌గా విడిపోయింది. ఈ రెండూ కేంద్ర పాలిత ప్రాంతాలయ్యాయి. వాటి పరిపాలన వ్యవహారాలన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్లాయి. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన అంశం సరికొత్త వివాదాలను సృష్టించింది. నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగాలంటూ కేంద్రం విజ్ఞప్తి చేసినప్పటికీ అది సాధ్యపడలేదు. గతంలో ఆయన ఈ విషయంపై అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు.

పాతికేళ్లకోసారి..
స్వయం ప్రతిపత్తి హోదాను కోల్పోయిన తరువాత నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమైందనేది కేంద్ర ప్రభుత్వం వాదన. ఇప్పుడున్న నియోజకర్గాలు జమ్మూ కాశ్మీర్, లఢక్‌లల్లో అటు, ఇటు అయ్యాయని, వాటికి ఓ సమగ్ర స్వరూపాన్ని ఇవ్వాల్సి ఉంటుందని చెబుతోంది. దీనికి అనుగుణంగా ఓ డీలిమిటేషన్ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది.

90 స్థానాలు..
జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం-2019 ప్రకారం- అక్కడి స్థానాల సంఖ్య 90కి పెరుగుతాయి. అంతకుముందు అక్కడ 87 స్థానాలు ఉండేవి. అందులో 46 కాశ్మీర్, 37 జమ్మూ రీజియన్ కిందికి వచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. 1995లో తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చోటు చేసుకుంది. 1981 జనాభా ప్రాతిపదికన వాటిని పునర్విభజించింది కేంద్రం. 1991లో అక్కడ జనాభా లెక్కింపు జరగలేదు.

2026 వరకూ..
2001లో ఈ లెక్కింపు తరువాత అప్పటి అసెంబ్లీ- ఓ తీర్మానాన్ని ఆమోదించింది. 2026 వరకూ ఎలాంటి నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదనేది దాని సారాంశం. దీన్నే అనుసరించాలనే వాదనను 14 రాజకీయ పార్టీలు కూడా అఖిలపక్ష సమావేశంలో కుండబద్దలు కొట్టాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇక ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.

పిటీషన్లపై విచారణ..
ఈ ప్రక్రియ మొత్తాన్నీ వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు ఇవ్వాళ తుది విచారణ చేపట్టింది. జమ్మూకాశ్మీర్ విభజనను సమర్థించింది. ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటు వ్యవహారం సరైనదేనని తెలిపింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం తాజాగా తుది తీర్పు వెలువడించింది.

పిటీషనర్ల తరఫున..
పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ జంధ్యాల రవిశంకర్ తన వాదనలను వినిపించారు. జమ్మూ కాశ్మీర్ విభజన.. రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్ 170 (3)కి విరుద్ధంగా ఇది జరిగిందని అన్నారు. 2026లో జనాభా లెక్కింపు తరువాతే విభజన చేపట్టాల్సి ఉంటుందని ఆర్టికల్ 170 (3) స్పష్టం చేస్తోందని, అయినప్పటికీ- కేంద్ర ప్రభుత్వం దీనికి విరుద్ధంగా వ్యవహరించిందని అన్నారు. పైగా నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటుందని, ఇక్కడ కూడా కేంద్రం నిబంధనలను ఉల్లంఘించిందని అన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications