అగ్ని 5 విజయవంతం: నిర్మలా సీతారామన్ ధృవీకరణ, చైనాకు వణుకే
న్యూఢిల్లీ: గురువారం ఉదయం 9.53గంటలకు అణ్వాయుధ సామర్థ్యంగల అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ఐదువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగివుంది ఈ క్షిపణి.
ఈ క్షిపణిని ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అగ్ని-5 క్షిపణిని పరీక్షించడం ఇది ఐదోసారి. 2016 డిసెంబర్ 26న అగ్ని-5 క్షిపణీ నాలుగో దఫా పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

ఈ క్షిపణినీ విజయవంతంగా పరీక్షించిన విషయాన్ని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ధ్రువీకరించారు. గురువారం అగ్ని-5 క్షిపణిని తాము విజయవంతంగా పరీక్షించి చూసినట్టు తెలిపారు.
కాగా, ఇది ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలదు. ఈ క్షిపణి పరిధిలోనే పాక్, చైనా దేశాల్లోని కీలక ప్రాంతాలుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications