వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘రాఖీ కడితే బెయిల్’: హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు, తీవ్ర అసంతృప్తి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లైంగిక దాడి కేసులో నిందితుడు బాధితురాలితో రాఖీ కట్టించుకుంటే బెయిల్ ఇస్తామని మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇండోర్ బెంచ్ గత సంవత్సరం ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో అపోహలు సృష్టించే తీర్పులు ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. అంతేగాక, ఆ తీర్పును కొట్టివేసింది.

 51 ఏళ్ళ వయసులోనూ లైంగిక వేధింపులు .. 66మంది మహిళలు, బాలికల ఫిర్యాదుతో యూపీ వ్యక్తి అరెస్ట్ 51 ఏళ్ళ వయసులోనూ లైంగిక వేధింపులు .. 66మంది మహిళలు, బాలికల ఫిర్యాదుతో యూపీ వ్యక్తి అరెస్ట్

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గత సంవత్సరం తన పొరుగు ఇంట్లో ఉండే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

Surpreme Court quashes Madhya Pradesh HC Rakhi for Bail order

2020 ఏప్రిల్ నెలలో నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్.. అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

అంతేగాక, బాధితుడు రక్షాబంధన్ రోజున తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లాలని, ఆమె చేతితో రాఖీ కట్టించుకోవాలని, ఆమెకు రూ. 11 వేలు ఇవ్వాలని, ఆమె కుమారుడికి రూ. 5వేలు ఇవ్వాలని ఇండోర్ బెంచ్ ఈ సందర్బంగా ఆదేశించింది.

అయితే, ఇండోర్ బెంచ్ ఆదేశాలపై మహిళా సంఘాలు, పలువురు ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బెయిల్ తీర్పును సవాల్ చేస్తూ కొంతమంది మహిళా న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై గత అక్టోబర్ నెలలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. బెయిల్ తీర్పు, నిందితుడి విడుదలను నిలిపివేసింది. ఇలాంటి తీర్పులు సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

English summary
The Supreme Court on Thursday set aside Madhya Pradesh high court's order granting bail to a man accused in a molestation case on a condition that he would tie 'Rakhi' to the victim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X