వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ భారీ తేడాతో ఓడిపోబోతుంది..నియోజకవర్గాలతో సహా

జాతీయ కాంగ్రెస్ పార్టీకి మరో రాష్ట్రం చేజారిపోనున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అవినీతి, హామీల అమలులో వైఫల్యం, అంతర్గత గ్రూపు రాజకీయాలకు తోడు మారుతున్న జాతీయ రాజకీయాల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తన పట్టు కోల్పోనున్నదని తాజా సర్వేలు తేటతెల్లం చేశాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ సంయుక్తంగా నిర్వహించిన 'పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్' సర్వే నివేదికలో ఈ షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి.

సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ఈ సర్వే తీవ్ర ప్రజా వ్యతిరేకతను బయటపెట్టింది. దీనికి విరుద్ధంగా, ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి ప్రజాదరణ గణనీయంగా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నేటికి ఎన్నికలు జరిగితే బీజేపీ ఏకంగా 136-159 స్థానాలతో అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ 62-82 స్థానాలకు పరిమితం కాగా, జేడీ(ఎస్) కేవలం 3-6 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది.

Survey predicts Congress will lose in Karnataka in the upcoming elections

మహిళా సంక్షేమ పథకాలు భారీగా అమలు చేస్తున్నా, కాంగ్రెస్‌కు ఆశించిన ఆదరణ లభించడం లేదు. ముఖ్యంగా పురుష, యువ ఓటర్లలో, రైతులు, హిందూ సామాజిక వర్గాల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. పహల్గాం ఘటన, ఆపరేషన్ సింధుర్ వంటి పరిణామాలు కూడా బీజేపీకి అనుకూలంగా మారినట్లు సర్వే చెబుతోంది.

గత 1985 నుండి కర్ణాటకలో ఏ అధికార పార్టీ కూడా తదుపరి ఎన్నికల్లో సొంతంగా సంపూర్ణ మెజారిటీ సాధించలేదనే చరిత్రను బట్టి చూస్తే, ప్రస్తుత ట్రెండ్ కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారడం ఆ పార్టీ అధిష్టానానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+