వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మా..మనిద్దరమూ తప్పే అనిపిస్తోంది.. చనిపోయిన తల్లి జ్ఞాపకాల్లో సుశాంత్.. డిప్రెషన్ లో చివరి పోస్టు

|
Google Oneindia TeluguNews

''మసకబారిన గతం.. కన్నీరుగా జారి ఆవిరవుతోంది.. అనంతమైన కలలు చిరునవ్వును.. అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి.. ఆ రెండిటి మధ్య బతుకుతున్నానే అమ్మా..’’అంటూ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తనలో సాగిన అంతర్మథనాన్ని కవిత రూపంలో రాశారు. దాదాపు ఆరు నెలలుగా ఫేస్ బుక్, ట్విటర్ కు దూరంగా ఉంటోన్న ఆయన.. తల్లిని తలుచుకుంటూ వారం కిందట ఇన్‌స్టాలో రాసిన కవిత ఇది.

బిన్ లాడెన్‌ తరహాలో అచ్చెన్న అరెస్టు.. వైసీపీ ఎంపీ అనూహ్య కామెంట్లు.. కడప జైలుకు లోకేశ్..

బాంద్రాలో ఒంటరిగా..

బాంద్రాలో ఒంటరిగా..

టీవీ నటుడిగా కెరీర్ ప్రారంభించి, ‘కాయ్ పో చే', ‘శుద్ధ్ దేశీ రొమాన్స్' సినిమాలతో స్టార్ గా ఎదిగి, ‘ఎంఎస్ ధోనీ' బయోగ్రఫీతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్(34) ఆత్మహత్యకు పాల్పడటం యావత్ దేశాన్ని కలచివేసింది. సహనటి అంకిత లోఖాండేతో ఆరేళ్ల సహజీవనం 2016లోనే ముగియడంతో బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ గత నాలుగేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నట్లు తెలిసింది. డిప్రెషన్ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాధమిక నిర్ధారించామని ముంబై పోలీసులు ప్రకటించారు.

టీనేజ్ లోనే పెనువిషాదం..

టీనేజ్ లోనే పెనువిషాదం..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పూర్వీకులది బీహార్ లోని పూర్నియా జిల్లా. అయితే, అతను పుట్టేనాటికే(1986, జనవరి 21) వాళ్ల ఫ్యామిలీ పాట్నాకు షిఫ్ట్ అయింది. సుశాంత్ సోదరి మితూ సింగ్ స్టేట్ లెవల్ క్రికెట్ ప్లేయర్. లైఫ్ హ్యాపీగా గడిచిపోయే టీనేజ్ లోనే అతను పెను విషాదాన్ని చవిచూశాడు. 2002లో తల్లి మరణంతో సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. వాతావరణం మారితేనైనా అతనిలో మార్పు వస్తుందన్న ఆశతో ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం ఢిల్లీకి మకాం మార్చింది.

18 ఏళ్లుగా ఆమె జ్ఞాపకాల్లోనే..

18 ఏళ్లుగా ఆమె జ్ఞాపకాల్లోనే..

ఢిల్లీకి వెళ్లాక క్రమంగా ఆటపాటల్లో రాణించి, సీరియళ్లలో రాణించిన సుశాంత్.. సినిమాల్లోనూ దశ తిరగడంతో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. పైకి సరదాగా, చాలా ఉల్లాసంగా కనిపించే సుశాంత్ అంతర్గతంలో ఆలోచనలన్నీ అమ్మ చుట్టూ తిరిగేవి. ఈ విషయాన్ని అతను కూడా ఏనాడూ దాచుకోడానికి ప్రయత్నించలేదు. గడిచిన 18 ఏళ్లలో తల్లిని తలుచుకుంటూ అతను ఎన్నెన్నో కవితలు, జ్ఞాపకాలు రాసుకుంటూ వచ్చాడు..

 మనిద్దరిదీ తప్పే...

మనిద్దరిదీ తప్పే...

‘‘నువ్వు నాతో ఉన్నప్పుడు మాత్రమే జీవించానేమో.. ఇప్పుడు నీ జ్ఞాపకాల్లో మాత్రమే.. అది కూడా ఓ నీడలా బతుకుతున్నానేమో అనిపిస్తోంది.. నీతో గడిపిన కాలం ఒక మెరుపు లాంటిదైదే.. ఆ క్షణం దగ్గరే కాలం శాశ్వతంగా ఆగిపోయినట్లుంది. అదొక్కటే నాకు అందంగా కనిపిస్తోంది.. '' అంటూ సుశాంత్ తన తల్లి తల్చుకుంటాడు. మరో సందర్భంలో.. ‘‘అమ్మా.. నీకు గుర్తుందా? ఎప్పటికీ నాతో కలిసుంటానని నువ్వు మాటిచ్చావు. నువ్వు లేకపోయినా సంతోషంగా నవ్వుతూ ఉంటానని నేను కూడా ప్రామిస్ చేశాను. కానీ ఇప్పుడనిపిస్తోంది.. మనిద్దరమూ తప్పేనని..''అంటూ సుశాంత్ వేదనను బయటపెట్టాడు.

Recommended Video

Sushant Singh Rajput : Celebs Response On Sushant Sudden Demise
దిగ్భ్రాంతి.. హెల్ప్ లైన్ నంబర్స్..

దిగ్భ్రాంతి.. హెల్ప్ లైన్ నంబర్స్..

34 ఏళ్ల వయసులోనే హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణానికి పాల్పడటం ఆయన సన్నిహితులతోపాటు అభిమానులనూ దిగ్భాంతికి గురిచేసింది. ఈ వార్త చూసి షాక్ కు గురయ్యామంటూ సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందినవాళ్లు సంతాపాలు తెలిపారు. వెటరన్ అనిల్ కపూర్ తన సందేశంతోపాటు ఓ హెల్ప్ లైన్ నంబర్ ను కూడా షేర్ చేశారు. ఆత్మహత్య ఆలోచనలు వస్తే ఆ నంబర్ కు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు. బాంద్రాలోని తన ఇంట్లో సీలింగ్ కు వేలాడుతూ కనిపించిన సుశాంత్ ను మొదట పనివాళ్లు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రాథమిక విచారణలో.. సుశాంత్ డిప్రెషన్ కారణంగానే తనువుచాలించినట్లు నిర్ధారణ అయిందని, పోస్ట్ మార్టం తర్వాత మరిన్ని వివరాలు చెబుతామని ముంబై పోలీసులు మీడియాకు వివరించారు.

English summary
Sushant Singh Rajput’s death has left his colleagues and fans in shock. The actor’s last Instagram post was a poem for his late mother where he spoke about how fleeting life is.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X