వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ బిల్లు పార్లమెంటులో పెడ్తారు, మద్దతిస్తాం: సుష్మా

By Pratap
|
Google Oneindia TeluguNews

Sushma
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేసపెడుతుందని, తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. సుష్మా స్వరాజ్ తమకు ఆ విధమైన హామీ ఇచ్చినట్లు బిజెపి శాసనసభ్యుడు యెన్నం శ్రీనివాస రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.

తెలంగాణ ప్రాంత బిజెపి నేతలు మంగళవారం సుష్మా స్వరాజ్‌ను కలిశారు. తెలంగాణపై తమ పార్టీ వైఖరిలో మార్పు లేదని యెన్నం శ్రీనివాస రెడ్డి చెప్పారు. కాగా, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ చెప్పారు.

రేపే తెలంగాణ బిల్లు

తెలంగాణ బిల్లుిను రేపు (బుధవారం) లోకసభలో ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో పార్లమెంటు ఉభయసభల్లో దేంట్లో బిల్లును ముందు ప్రవేశపెడతారనే విషయానికి తెర పడింది.

ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వలేమని అద్వానీ చెప్పినప్పటికీ బిజెపి వైఖరి మరో విధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. కాంగ్రెసు వ్యవహార శైలిని తప్పు పడుతూనే తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో బిజెపి నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ బిల్లును తక్షణమే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని బిజెపి నేత అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు తాము ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. గత పదేళ్లుగా తెలంగాణ అంశాన్ని యుపిఎ ప్రభుత్వం నానుస్తోందని ఆయన విమర్శించారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని, రెండు ప్రాంతాలను సమన్వయ పరచడంలో యుపిఎ విఫలమైందని ఆయన అన్నారు.

English summary
BJP leader Sushma Swaraj said that her party will cooperate to pass Telangana bill in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X