మహారాష్ట్ర, హర్యానా: సీఎం రేసులో సుష్మా, నితిన్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాల్లో ముఖ్యమంత్రి పదవి కోసం భారతీయ జనతా పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకే ఆధిక్యం వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సీఎం పదవి ఆశిస్తున్న వారి సంఖ్య మరింత పెరుగుతోంది. హర్యానా, మహారాష్ట్రలలో ముఖ్యమంత్రి పదవులకు కొత్తపేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
హర్యానా ముఖ్యమంత్రి పదవికి సీనియర్ నాయకురాలు, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ పేరు తెర పైకి వస్తోంది. అది విధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలున్నాయంటున్నారు.

సుష్మా, గడ్కరీ ముఖ్యమంత్రులుగా వెళ్లినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే అత్యంత కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్న సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించటానికి ఇష్టపడతారా? అన్న ప్రశ్న కూడా పలువురిని తొలుస్తోంది.
సుష్మా స్వరాజ్ కాదంటే దళితులు, వెనుకబడినవర్గాలవారు తమకు అధిక సంఖ్యలో ఓట్లు వేసినందుకు కృతజ్ఞతగా ఈ వర్గాలకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి హర్యానా రాజకీయాలలోసరి కొత్త మార్పు తీసుకురావాలని పార్టీ నాయకత్వం ఆలోచిస్తోందని అంటున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ గుజ్జర్, మాజీ అధ్యక్షుడు రామ్ విలాస్ శర్మతోపాటు అనిల్ విజ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు దేవేందర్ ఫడ్నవిస్ పేరు బాగా వినబడుతోంది. అయితే రాష్ట్ర రాజకీయాలపై ఇష్టం లేదని చెబుతూనే మరోపక్క సంఘ్ నాయకుల ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ మాత్రం ఫడ్నవిస్ అభ్యర్తిత్వంపైనే మొగ్గు చూపుతున్నందున గడ్కరీకి అవకాశాలు తక్కువగా ఉంటాయంటున్నారు.
ఫడ్నవిస్ వివాదాలకు అతీతంగా ఉంటూ ఇప్పటివరకూ మూడుసార్లు విధానసభకు ఎన్నికయ్యారు. నాగపూర్‌నుంచి పోటీ చేసిన ఫడ్నవిస్‌పై ఆరెస్సెస్‌కు మంచి నమ్మకం ఉన్నందున ఆయనకే పీఠం దక్కుతుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. దివంగత మంత్రి గోపీనాధ్ ముండే కుమార్తె పంకజ్ ముండే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు చేసిన బహిరంగ ప్రకటన పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఎన్నికల ప్రచారంలో గోపీనాథ్ ముండే అనుచరులు నిరాశ పడవలసిన అవసరం లేదని హామీ ఇస్తూ మహారాష్ట్రకు మహిళా ముఖ్యమంత్రి రావచ్చునని ప్రకటించారు. అయితే మోడీ మాత్రం ఫడ్నవిస్ అభ్యర్దిత్వానికే ఓటు వేస్తారని అంటున్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications